పిల్లలు కనడమే కాన్సెప్ట్.. ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. ఎక్కడంటే?

praveen
అవును, మీరు విన్నది నిజమే. వింటూనే ఎక్సయిటింగ్ గా ఉంది కదూ. మనకీ అలాంటి అవకాశం వస్తే బావున్ను అని అనిపిస్తోంది కదూ! అయితే ఆ అవకాశం మనకి లేదండోయ్. ఇది జపాన్ దేశపు ఉద్యోగస్తుల కోసమే. అవును.. టోక్యో ప్రభుత్వం యువకుల కుటుంబాలకు మద్దతుగా నిలిచింది. దానికి తోడు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో తక్కువ సంతానోత్పత్తి రేటు నమోదు కావడం చేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కార్మికులకు 4 రోజుల పని దినాలను కుదించే దిశగా అక్కడి సర్కార్ యోచిస్తోంది.
దేశం యొక్క సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో స్వల్పంగా ఉండడం చేత జపాన్ వివాహిత జంటలు ఎక్కువమంది పిల్లలను కనేలా, అదే సమయంలో పిల్లలు లేనివారు కూడా పిల్లల్ని కనేలా ప్రోత్సహించడానికి ఈ కొత్త విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నుండి మెట్రోపాలిటన్ ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 3 రోజులు సెలవు తీసుకోవచ్చని టోక్యో గవర్నర్ యురికో కోయికే తాజాగా ప్రకటించారు. ఆరోగ్య, కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, అక్కడి కుటుంబాలను, యువకులను ప్రేరేపించడానికి ప్రభుత్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడి సంతానోత్పత్తి రేటు ఓ మహిళ జీవితకాలంలో 1.2 పిల్లల శాతానికి  పడిపోయింది. ఇక అక్కడి జనాభా స్థిరంగా ఉండాలంటే, ఈ సంఖ్య కనీసం 2.1 ఉండాలి. ఈ తరుణంలోనే అక్కడి ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆరోగ్య, కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, గత సంవత్సరం జపాన్‌లో 727,277 జననాలు మాత్రమే జరిగినట్టు సర్వేలు చెబుతున్నాయి.
ఇకపోతే వారానికి 4 రోజుల పనిదినాన్ని ప్రవేశపెట్టడం చేత ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు. అందుకే ఈ విధానానికి అక్కడి జనాలు సైతం మద్దతు ఇస్తున్నారు. ఇక ఇదే విధానాన్ని ఈ సంవత్సరం ప్రారంభంలో, మరొక ఆసియా దేశం సింగపూర్ ప్రవేశ పెట్టిన సంగతి అందరికీ తెలిసినదే. మరోవైపు చైనాలో ‘పిల్లలను కనండి.. డబ్బులు సంపాదించండి’ అని డైరెక్ట్ ఆఫర్ ఇస్తున్నారు. చైనాలో కూడా జననాల రేటు పడిపోయిన సంగతి మీరు వినే ఉంటారు. ఓ చైనీస్ కంపెనీ ఐతే మహిళలకు ఈ వింత ఆఫర్‌ను ప్రకటించింది. 28 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సర్రోగేట్ తల్లులుగా మారితే.. లక్షలు సంపాదించకోవచ్చునని ఆ కంపెనీ ఆన్‌లైన్‌లో ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: