మోహన్ బాబుకు షాక్.. మనోజ్ వెనుక టీడీపీ...ఇక బౌన్సర్లు సరిపోరు ?

Veldandi Saikiran
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ పైన దాడి జరిగినట్లు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. స్వయంగా తండ్రి మోహన్ బాబు అనుచరులు... తనపై దాడి చేసినట్లు హీరో మంచు మనోజ్ ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి రోజున ఆసుపత్రిలో కూడా గాయాలతో మంచు మనోజ్.. జాయిన్ అయ్యారు.
 ఈ సందర్భంగా వెన్నుముక అలాగే కడుపులో మంచు మనోజ్ కు గాయాలు అయినట్లు వార్తలు వచ్చాయి.. తాజాగా మంచు మోహన్ బాబు పైన  మంచు మనోజ్ కేసు కూడా పెట్టాడు. తన తండ్రి దాడి చేసినట్లు కేసులో వివరంగా పేర్కొనడం జరిగింది. ఆస్తి తగాదాల కారణంగానే ఈ గొడవలు జరుగుతున్నట్లు... టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు  వస్తున్నాయి. దీంతో మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు... మంచు మనోజ్ కు నిద్ర లేకుండా చేస్తున్నారట.
 అయితే ఇలాంటి నేపథ్యంలో కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఉన్నఫలంగా మోహన్ బాబుపై చిన్న కొడుకు మంచు మనోజు తిరుగుబాటు చేయడానికి అసలు కారణం తెలుగుదేశం పార్టీ అని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అండా దండలతో ముందుకు వెళ్తున్నాడట ఆ
మంచు మనోజ్. భూమా కుటుంబ సభ్యులు ప్రస్తుతం టిడిపిలోనే ఉన్న సంగతి తెలిసిందే. భూమా అఖిలప్రియ సోదరి... భూమా మౌనిక రెడ్డి...  మనోజ్ భార్య కావడంతో... రంగంలోకి టిడిపి దిగినట్లు తెలుస్తోంది.
 జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంచు మోహన్ బాబు... చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... మనోజ్ కు అండగా టిడిపి నిలిచిందట. టిడిపి అండతోనే మనోజ్.. కేసు పెట్టే వరకు వెళ్లాడట. అటు ఎల్లో మీడియా కూడా మనోజ్ కు  అన్యాయం జరుగుతోందనే కోణంలోనే వార్తలు ప్రచురిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో... ఇదంతా టిడిపి.. వెనుకుండి నడిపిస్తుందని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: