గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ టీచర్ గోపీ విక్టరీ వెనక టాప్ సీక్రెట్ ఇది...!
గోదావరి జిల్లాల్లో జరిగినవి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలేగానీ..
అక్కడి టీచర్ సీటు అంటే ఎప్పుడూ హాట్ సీటుగానే ఉంటుంది.
గతంలో నల్లమిల్లి శేషారెడ్డి, చైతన్య రాజు లాంటి బడా విద్యావ్యాపారులు గెలిచిన సీటు.
ఈసారి ఉప ఎన్నికలే అయినప్పటికీ గట్టిగా ప్రత్యర్థులు ప్రయత్నించారు.
పీడీఎఫ్ మాత్రం ఓ సామాన్య ఉపాధ్యాయుడిని నిలిపింది.
బొర్రా గోపీమూర్తి ఆరంభం నుంచి ఉపాధ్యాయ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు.
షేక్ సాబ్జీ మరణం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సంఘం ఆదేశించగానే ఉద్యోగ విరమణ చేసి బరిలో దిగారు.
ఆయనకు ఇంకా పదేళ్లకు పైగా సర్వీసు ఉండగా వదులుకున్నారు.
ఇతర ఎమ్మెల్సీల మాదిరిగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు పెద్దగా వ్యక్తిగత ప్రయోజనాలుండవు.
వారి జీతభత్యాలు కూడా సంఘమే తీసుకుంటుంది.
వారి ఖర్చులకు కొద్ది మొత్తం చెల్లిస్తారంతే.
అందుకే రాము సూర్యారావుని ఏరికోరి గెలిపించిన పీడీఎఫ్
అలాంటి వారి స్థానంలో ఇప్పుడు బొర్రా గోపీ మూర్తిని నిలబెట్టి గెలిపించింది.
అందులోనూ 65 శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రావడం అంటే అసాధారణం అన్నట్టే.
అందుకు కారణం గోపీ మూర్తి వంటి సేవపరుడు బరిలో ఉండడం ఒకటైతే
ఉపాధ్యాయ లోకంలో యూటీఎఫ్ సర్వీసులు కూడా మరో కారణం.
కరోనా వంటి విపత్తులో యూటీఎఫ్ ఆఫీసులను కోవిడ్ కేంద్రాలుగా మార్చారు.
ఇతర సంఘాలు, పెద్ద పెద్ద పార్టీలు ఇళ్లల్లో ఉన్న రోజుల్లో యూటీఎఫ్ శ్రేణులు సేవలందించాయి.
ఇతర అనేక రూపాల్లో టీచర్ల సమస్యలపై స్పందించడం, సేవా కార్యక్రమాల్లో చొరవగా ఉండడం యూటీఎఫ్ ఘనత.
అందుకే అన్ని సంఘాలు ఏకమయ్యి యూటీఎఫ్ ను అడ్డుకోవాలని చూసినా పరువు పోగొట్టుకున్నారే తప్ప యూటీఎఫ్ కి అడ్డువేయలేకపోయారు.
ఏమైనా గోపీ మూర్తి వంటి సాధారణ ఉపాధ్యాయులు మండలిలో అడుగుపెట్టడం ఆహ్వానించాలి.
పెద్దల సభకు అలాంటి వాళ్లు వన్నె తెస్తారని ఆశిస్తూ..
శాసనమండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా,
ప్రజల సమస్యలపై స్పందించే వారికి వేదికగా మార్చే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ
ఉపాధ్యాయ నేత విజయానికి ప్రతి ఒక్కరు అభినందనలు తెలియ జేస్తున్నారు.