ఏపీ: ఆ పార్టీలోకి వాసిరెడ్డి పద్మ.. కీలకమైన పదవి ఇదే..!

Divya
ఏపీ మహిళా కమిషనర్ మాజీ చైర్మన్, వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ ఇటీవలె వైసిపి పార్టీకి రిజైన్ చేసింది.. ప్రస్తుతం ఇమే ఏ పార్టీలో చేరుతుందనే విషయం పైన నిన్నటి రోజున క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ పార్టీలోకి చేరబోతున్నట్లు సమాచారం ఆ మేరకు నిన్నటి రోజున అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.. ఎంపీ కేసినేని చిన్ని తో భేటీ అనంతరం వారం రోజుల్లో ఆమె టిడిపి పార్టీలోకి చేరబోతున్నట్లు ప్రకటించింది.

వాసిరెడ్డి పద్మతో పాటుగా భారీగానే టిడిపి పార్టీలోకి చేరికలు ఉంటాయని తెలియజేస్తున్నట్లు సమాచారం.. గుంటూరు, విజయవాడ ఏలూరు వంటి ప్రాంతాలలో చాలామంది వైసిపి నేతలు టిడిపి పార్టీలోకి చేరబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి 2024 ఎన్నికలలో వైసిపి ఓడిపోవడంతో అప్పటికే తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం పైన కూడా అలాగే కనీసం తాను ఆశించిన నియోజకవర్గానికి ఇన్చార్జి పదవి కూడా ఇవ్వకపోవడం పైన ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైందని అప్పటినుంచి అటు వైసిపి పార్టీకి ఈమె దూరంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈమె వైసిపి పార్టీ రిజైన్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి వైసీపీ అధినేత జగన్ పైన తీవ్రమైన విమర్శలు కురిపించింది. కార్యకర్తలని అసలు పట్టించుకోలేదని విధంగా తెలియజేసింది.

రాజీనామా అనంతరం జనసేన పార్టీలోకి చేరుతుందని విధంగా వార్తలు వినిపించాయి.. మొదట ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న..మళ్లీ వైసీపీ పార్టీలోకి చేరింది.. దీంతో ఆమెకు గౌరవంగా ఏపీ మహిళా కమిషనర్ పదవి కూడా వైసిపి నేత ఇచ్చారు.. మరి ఇప్పుడు టిడిపి పార్టీలోకి చేరితే ఈమె పరిస్థితి ఏంటి ఎలాంటి పదవులు లేకుండా ఉండగలరా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: