జమిలి ఎన్నికలపై జగన్ భయపడ్డారా? అందుకే జనంలోకి వస్తున్నారా?

Chakravarthi Kalyan

ఏపీలో ఎన్నికలు జరిగి ఆరునెలలు పూర్తవుతోంది.  ఐదేళ్ల సాగిన వైసీపీ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే  వైసీపీ పాలనలో అష్టకష్టాలు పడ్డ తమ పార్టీల నాయకుల్ని, శ్రేణుల్ని సంతృప్తి పర్చేందుకు దూకుడుగా రాజకీయాలు చేస్తోంది.  ఈ నేపథ్యంలో అసెంబ్లీకి కూడా వెళ్లకుండా బహిష్కరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు.


సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రతీ వారం ఓ జిల్లా చొప్పున 26 జిల్లాల్ని చుట్టేయబోతున్నారు.  వారానికి రెండు రోజుల పాటు ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ అక్కడే బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  జమిలి అంటున్నారని, తాము సిద్దం కావాల్సిన తరుణం వచ్చేసిందని నేతలకు పదే పదే చెప్తున్నారు.  దీంతో జగన్ జిల్లాల టూర్ ఆసక్తి రేపుతోంది.  ఆరునెలల క్రితమే తమ తీర్పు చెప్పేసిన ప్రజలు జగన్ ను మళ్లీ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చర్చ కూడా మొదలైంది.


కూటమి ప్రభుత్వంపై జనంలోకి వెళ్లి అటో ఇటో తేల్చేసుకోవాలనే ఆరాటం జగన్ లో కనిపిస్తోంది. అయితే దీని వెనుక జమిలి ఎన్నికల భయం కూడా ఉందని చెప్తున్నారు.  కేంద్రం ఓవైపు తమ హయాంలో జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెబుతోంది. జనాభా లెక్కల కసరత్తుతో పాటు నియోజకవర్గాల పునర్ విభజన కసరత్తు కూడా పూర్తి కావాల్సి ఉంది.  


వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ లేదా వాటి అధినేతలు ఎన్నికలకు ఏడాది ముందో, ఆరు నెలల ముందో జనంలోకి వెళ్లాలనుకుంటారు.  అంతకు ముందే జనంలోకి వెళ్లి ఎన్ని చెప్పినా చివరికి ఎన్నికల నాటికి అవన్నీ గుర్తుండవన్న భావనే దీనికి కారణం. అలాగే క్యాడర్ ను యాక్టివ్ చేసేందుకు పర్యటనలు చేయాలన్నా ఇలా చివరి ఆరునెలల్లోనే పెట్టుకుంటారు. గత ఎన్నికల సమయంలో జగన్ కూడా ఏడాది ముందు హడావిడి ప్రారంభించి ఆరు నెలల క్రితం సిద్దం సభలు నిర్వహించారు. కానీ ఇప్పుడు మాత్రం జమిలి ముందుకు జరుగుతుందన్న భయాలతోనే ఇలా వెంటనే జనంలోకి వెళ్లిపోవడమే బెటర్ అనుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: