ఏపీ: రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్..!
అయితే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను సైతం తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈమెరకు ఒక కొత్త డిజైన్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ప్రస్తుతం కార్డులో వైఎస్ బొమ్మలతో పాటు జగన్ ,ఆకుపచ్చ నీలం తెలుపు రంగులతో రేషన్ కార్డులు కలవు ఈ బొమ్మలు తొలగించడంతో పాటుగా రంగులు కూడా మార్చి సరికొత్త డిజైన్తో తీసుకురాబోతున్నారట. అలాగే రేషన్ కార్డులో రాష్ట్రంలో ఉండే అనర్హులను సైతం తొలగించి అర్హులకు రేషన్ కార్డు మంజూరు చేస్తామంటూ తెలిపారు.
పౌరసరఫరాల శాఖ ప్రకారం 17,941 అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నాయని.. వీరితో పాటుగా 1,36,420 PHHFH కార్డులు కూడా కలవని వీరు గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోలేదంటూ తెలియజేశారు. వీరిని తొలగిస్తే సుమారుగా 90 కోట్లు ఆదా అవుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోందట. ఇప్పటికే 1.48 కోట్ల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని ఇందులో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఉన్నవని తెలిపారు. వీరికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుందని అలాగే తక్కువ ధరకే కందిపప్పు పంచదార కూడా అందిస్తుందని తెలిపారు.
మొత్తానికి కొత్త రేషన్ కార్డులు వివాహమైన వారు లేదా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి 28 వరకు అవకాశం ఉంటుందట.