కొత్త ఏడాదిలో సరికొత్తగా ఒకేసారి జనాల్లోకి రానున్న జగన్, కేసీఆర్..?
ఓడాక కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి పరిమితం అయ్యారని విమర్శలు ఉన్నాయి. జగన్ అయితే తాడేపల్లి టూ బెంగళూరు అన్నట్లుగా ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నేతలు మంచి ముహూర్తం చూసుకుని జనంలోకి రావాలని అనుకుంటున్నారు. కొత్త ఏడాది జనవరిని వారు ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు. 2025 లో సంక్రాంతి దాటిన తరువాత కేసీఆర్ జనంలోకి వస్తారని మొత్తం బీఆర్ఎస్ రాజకీయమే గేర్ మారుస్తారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఏపీలో చూస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతుంది. గ్రౌండ్ లెవెల్ లో పధకాల మీద జనాలలో ఆశలు ఉన్నాయి. సూపర్ సిక్స్ హామీలలో ఇంకా టీడీపీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది.దాంతో వాటిని పట్టుకుని జగన్ జనంలోకి వెళ్తే బ్రహ్మరధమే పడతారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక్కసారి జగన్ జనంలోకి రావాలే కానీ ప్రజా దరణ విషయంలో తిరుగు ఉండదని అంటున్నారు.
దాంతో జగన్ కూటమి ప్రభుత్వం మీద తనదైన పోరాటాన్ని కొత్త ఏడాది మొదలెడుతున్నారు అని అంటున్నారు. జగన్ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తారు అని అంటున్నారు. ఒక వైపు క్యాడర్ తోనూ మరో వైపు పార్టీ నేతలతోనూ మీటింగ్స్ పెడుతూనే ఇంకో వైపు జనాలతో సభలు నిర్వహిస్తారని అంటునారు. అటు కేసీఆర్ ఇటు జగన్ కూడబలుక్కున్నట్లుగానే అధికార పార్టీల మీద తమదైన శైలిలో సమరం సాగిందేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు.