ఏపీ: పార్టీ మార్పుపై.. ఆ మహిళా నేత క్లారిటీ ఇచ్చినట్టేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీ ఎన్నికలలో ఓడిపోవడంతో నియోజవర్గాలలో కొత్త అధ్యక్షుని నియమించారు. అంతేకాకుండా పార్టీ అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. అన్ని జిల్లాలలో నియోజవర్గాలకు ఇన్చార్జిలను కూడా మారుస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లాలో ఏకంగా రెండు నియోజకవర్గాలలో ఇన్చార్జిలను మార్చినట్లుగా తెలుస్తోంది. మాజీమంత్రి విడుదల రజనీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం అధిష్టానం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈమె జనసేన పార్టీలోకి వెళ్లబోతోందనే రూమర్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు అధిష్టానం నిర్ణయంతో ఏమి పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చినట్లే అని సమాచారం.

గుంటూరు జిల్లాలోని తాడికొండ చిలకలూరిపేట నియోజకవర్గాలకు సైతం వైసీపీ కొత్త సమన్వయ కర్తలను సైతం నియమించారు.. తాడికొండలో మాజీ మంత్రి సుచరితను కాకుండా బాలవజ్రబాబును తీసుకువచ్చారు.. అలాగే చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు స్థానంలో మళ్లీ మాజీ మంత్రి అయిన రజినీని తీసుకురావడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంత మంది వైసీపీ నేతలు పార్టీని వీరడంతో కొన్ని నియోజకవర్గాలలో కొంత మంది సమన్వయకర్తలు సైతం అందుబాటులో లేకపోవడంతో ఉన్న నేతలని కొనసాగించేందుకు ఆసక్తి చూపించడంతో అధిష్టానం మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.

గత కొద్ది నెలలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గానికి కావటి మనోహర్ నాయుడు ఉండగా ఇప్పుడు ఆయనను తప్పించి మాజీమంత్రి  రజినీని అక్కడికి పంపించారు. ఇప్పుడు మళ్లీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆమెను తప్పించి చిలకలూరిపేటకు పంపించినట్లు తెలుస్తోంది. మరొకవైపు తాడికొండ నియోజకవర్గం లో గతంలో హోం శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రి మేకతోటి సుచరిత.. కొనసాగలేనని చెప్పడంతో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబుని నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించారట. మొత్తానికి వైసీపీ పార్టీ అధిష్టానం నియోజవర్గాలపైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి పార్టీ మార్పు పైన విడుదల రజిని క్లారిటీ వచ్చినట్లేనని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: