ట్రంప్ గెలిస్తే నిజంగా పెద్దన్న అవుతాడు.. ఎందుకో తెలుసా?

praveen
ప్రస్తుతం అమెరికా ఎలెక్షన్స్ చుట్టూ ప్రపంచ మీడియా తిరుగుతోంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అవును, మనది కాని ఎలక్షన్ కోసం మనకెందుకు? ఎవరు అధ్యక్షుడు అయితే మనకేంటి? అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనకి ఇపుడు అది చాలా అవసరం. ఎందుకంటే డాలర్‌ డ్రీమ్స్‌లో మునిగితేలే మన విద్యార్థుల స్టూడెంట్‌ వీసాల నుంచి, ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించే H1B వీసాల దాకా, నిబంధనలు మనకి అనుకూలంగా ఉంటేనే మేలు జరుగుతుంది. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో ట్రంప్‌ అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు, H1B వీసాల విషయంలో నిబంధనలను కఠినతరం చేయడంతో ఇండియన్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌ ఇబ్బందులు పడిన సంగతి విదితమే.
ఇక ప్రస్తుతం వస్తున్న సమాచారం మేరకు మరలా ట్రాంప్ నెగ్గడానికి మెండుగా అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. ఈ సారి గాని మరలా ట్రంప్ నెగ్గినట్టయితే, పెద్దన్న పాత్రని పోషిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. పెద్దన్న అంటే అదేదో అన్ని దేశాలకు ఆయనే ముఖ్య నాయకుడని కాదుగానీ, వయస్సు విషయంలో ట్రంప్ అందరికంటే పెద్దవాడిగా అవతరించనున్నాడు. అవును, ప్రస్తుతం ఆయన వయస్సు 78 సంవత్సరాలు కాగా ఆ వయస్సు కలిగిన నేతలు మరేదేశంలో కూడా లేరు. భారత ప్రధాని వయస్సు కూడా 74 సంవత్సరాలు కావడం గమనార్హం. అందుకే ట్రంప్ అందరికంటే పెద్దవాడిగా అవతరించనున్నాడు.
ఇకపోతే ట్రంప్ అధికారంలోకి వస్తే విదేశీ వలసదారులపై కఠిన వైఖరి మాత్రం తప్పేలా కనబడడంలేదు. అయితే మనకు శత్రువు లాంటి చైనాకు ట్రంప్‌ బద్ధ వ్యతిరేకిగా ఉండడం కొసమెరుపు. మరోవైపు పాకిస్తాన్‌ అంటే కూడా ట్రంప్‌కు పెద్దగా నచ్చదు. దీంతో పాక్ ప్రజలు డెమోక్రాట్ల గెలుపునే కోరుకుంటున్నారు. ట్రంప్ గెలిస్తే చైనాపై పోరులో భారత్‌కు అమెరికా మద్దతు లభించే అవకాశం కూడా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో రిపబ్లిక్ అండ్ పార్టీ విజయం వైపుగా దూసుకెళ్తోంది. అమెరికా అధ్యక్షుడుగా మరోసారి డోనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టడానికి మార్గం ఖాయం అని సర్వేలు ఇప్పటికే ఘోషిస్తూ ఉన్నాయి. ఇక డోనాల్డ్ ట్రంప్ గెలుపు నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్ సూచి డో జోన్స్ 1.02 శాతంతో లాభపడింది. నాస్టాక్ సూచీ 1.4 శాతం లాభపడింది. S&P సూచీ 1.23 శాతం లాభపడింది. దీనికి తోడు భారత స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లోకి వస్తున్నట్టు కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: