వైఎస్ విజయమ్మ: సంచలన వీడియో రిలీజ్.. కుట్ర పై క్లారిటీ ఇదే..!
ఈ విషయం పైన తాజాగా సోషల్ మీడియా వేదికలో విజయమ్మ ఒక వీడియోతో సహా ఇలాంటి కుట్ర దృశప్రచారాలకు సైతం పెట్టే విధంగా రిలీజ్ చేసింది. తనపై తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యా ప్రయత్నం చేశారంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను చూసి తనకు చాలా ఆందోళన వ్యక్తం అవుతుందని పాత వీడియో ఒకటి బయటకు తీసుకువచ్చి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని తెలియజేసింది విజయమ్మ. మా కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు కానీ అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతారా అంటూ విజయమ్మ ప్రశ్నించింది.
ఇటీ వలే రాసిన రెండు లేఖలు కూడా తనవేనని నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం తమ కుటుంబానికి ఏమీ లేదని తన కుమారుడు జగన్ కు అలాంటి అవసరం లేదని కూడా తెలియజేసింది. ఇంకొకసారి ఇలాంటి దుష్ప్రచారాలు ఎవరైనా చేశారంటే కచ్చితంగా వారి మీద పరువు నష్ట దావవేస్తామంటూ హెచ్చరించింది విజయమ్మ.. రాజకీయాలు చేయాలి అంటే నా కొడుకుతోనే డైరెక్ట్ గా ఫైట్ చేయండి కానీ ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయవద్దండి అంటూ హెచ్చరిస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారాలు చేసే వారందరికీ కూడా గట్టి కౌంటర్ వేసింది విజయమ్మ. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.