స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న కమెడియన్.. ఎవరో తెలుసా..?
ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ 35 వేల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటే రాజబాబుకు 20వేల రూపాయల వరకు నిర్మాతలు ఇచ్చేవారట. రాజబాబు తన సినీ కెరియర్ మొదట్లో అవకాశాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడే వారట. మొదటిసారి అంతస్తులు అనే సినిమాలు నటించినందుకు 1000 రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారట. రూ .5 రూపాయల భోజనం కోసం ఎన్నో గంటలు క్యూలో నిలబడే రాజాబాబు రాను రాను లక్ష రూపాయలు ఖరీదైన కారులో కూడా తిరిగే స్థాయికి ఎదిగారు.
ముఖ్యంగా మరొక సహానటి రమ ప్రభ, రాజబాబు కామెడీ ప్రేక్షకులలో విపరీతంగా క్రేజ్ ను సంపాదించింది. ఈ కాంబోలో తెరకెక్కించిన చిత్రాలు అన్నీ కూడా భారీ విజయాన్ని అందించాయి. రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.. 45 సంవత్సరాల వయసులోని రాజబాబు మరణించడంతో చాలామంది ఒక గొప్ప కమెడియన్ ని కోల్పోయామని సినీ సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. రాజబాబు ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు. అందుకే ఆయనకు అప్పట్లో ఏడాదికి ఎన్నో చిత్రాలలో నటిస్తూ ఉండేవారు. ఇక రాజబాబు తన సొంత ఊరి కోసం కూడా చాలానే పనులు చేయడంతో తన సొంత ఊరిలో ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.