భారత నేతలను ఆదర్శంగా తీసుకున్న ట్రంప్...మరీ విజయం సంగతేంటి.?

FARMANULLA SHAIK
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు మంగళవారం పోలింగ్‌ జరగనుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌, మరోసారి అధికారం కోసం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. పోలింగ్లో పాల్గొనేందుకు అమెరికా ఓటర్లు కూడా ఉత్సాహన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే ముందుగా ఓటేసే అవకాశాన్ని 6.8 కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకున్నారు. ఈ నేపథయంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ప్రపంపమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అక్కడి ఎన్నికలపై భారత్లో కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది.ఇక అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం ముగింపు దశలో ఉంది. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ తనకు అనుకూలమైన నార్త్‌ కరోలినాలో ప్రచారం చేస్తున్నారు. మంగళవారం వరకూ నార్త్‌ కరోలినాలో ఉండి ర్యాలీలు నిర్వహించాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. 2016, 2020లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా దృష్టి సారించారు.

అమెరికాలో భారతీయ మూలాలున్న ఓటర్లు తక్కువేం కాదు. అందుకే ప్రచారంలో భారతీయుల ప్రస్తావన తరచూ వస్తోంది. స్వయంగా కమలా హ్యారిస్ భారతీయ మూలాలున్న అభ్యర్థి. అక్కడ స్థిరపడిన విదేశీయులు ఓటర్లుగా మారడమే కాదు.. ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే వారిలో భాగం అవుతున్ననారు. ఈ విషయంలో భారతీయులు చాలా ముందు ఉన్నారు.ఈ నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మూడు రోజల కిదంట పూర్తిగా గార్బేజ్ కలెక్షన్స్ చేసేవారి యూనిఫాంలో ప్రచారం చేశారు. దానికి కారణం డెమెక్రటిక్ అధ్యక్షుడు బైడెన్ .. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమల్ హ్యారిస్‌కు మద్దతుగా జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ " అని ప్రచార ర్యాలీల్లో గార్బేజ్ మాత్రమే ప్రవహిస్తుంది" అని విమర్శించారు. ఇంతకంటే చాన్స్ రాదనుకున్న ట్రంప్ వెంటనే గార్బేజ్ కలెక్షన్ చేసే వాళ్ల యూనిఫాంతో రాజకీయాలు ప్రారంభించారు. ఈ ఇన్సిడెంట్ చూస్తే ఎవరికైనా భారత ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. 

ఆయన మొదట్లో కాంగ్రెస్ ను ఇలాగే కార్నర్ చేసేవారు. మొదటి సారిగా చాయ్ పే చర్చా అనే కార్యక్రమాన్ని ఇలాగే అందుకున్నారు. ఓ కాంగ్రెస్ నేత చేసిన విమర్శతో అవును తాను చాయ్ అమ్ముకునే ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. ఆయన స్ట్రాటజిస్టులు వెంటనే చాయ్ పే చర్చాకు రూపకల్పన చేశారు. ఇలా ప్రచార వ్యూహాల్ని అందుకోవడం భారత నేతల నుంచి ట్రంప్ నేర్చుకున్నట్లుగా ఉన్నారు. ఆయన గార్బేజ్ డ్రెస్‌తో చేసిన రాజకీయం భారత ప్రజల్ని ఇదెక్కడో చూసినట్లుందే అనుకునేలా చేసింది. నిజానికి ట్రంప్ రాజకీయ వ్యూహాలన్నీ భారత రాజకీయ నాయకులవి పోలి ఉంటాయి. గత వారం ఆయన మెక్ డొనాల్డ్స్ లో పని చేశారు. అది మొత్తం స్క్రిప్టెడ్. రిహార్సల్స్ పూర్తి చేసి షూట్ చేసుకున్నారు. ఓ. ప్రవాస భారతీయుడికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చి ఆయన చెప్పించుకున్న మాటలు వింటే ఇలాంటి డ్రామాలు చాలా చూశాం కదా అనుకుంటారు ఇండియన్స్. అందువల్ల నే అక్కడి రాజకీయ నాయకులు ముఖ్యంగా ట్రంప్ అనుసరిస్తున్న రాజకీయవ్యూహాలు పూర్తిగా భారతీయ రాజకీయ నేతల్ని పోలి ఉన్నాయి. అందుకే ఆయన ప్రచారం భారత్ లో ఎక్కువగా హైలెట్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: