బంధువుల ఇళ్లకు వెళ్లి జగన్ మంతనాలు.. వాళ్ల రాయభారం ఫలిస్తుందా?
ఎక్కువమంది జగన్ కు మద్దతు ఇస్తుండగా కొంతమంది మాత్రం షర్మిలకు మద్దతు ఇస్తున్నారు. విజయమ్మ సైతం వ్యతిరేకంగా మారడం జగన్ కు భారీ షాక్ అని చెప్పవచ్చు. తల్లి తప్పు చేస్తున్నారంటూ జగన్ వైసీపీ తరపున బహిరంగ లేఖను రిలీజ్ చేయడం జరిగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ మనోహర రెడ్డిలతో జగన్ గంటకు పైగాచర్చించినట్లు తెలుస్తోంది.
విజయమ్మ, షర్మిలతో రాజీ దిశగా జగన్ అడుగులు పడనున్నాయని సమాచారం అందుతోంది. అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి రాజీ కుదిర్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. జగన్ మరి కొందరు సన్నిహితుల ఇళ్లకు సైతం వెళ్లనున్నారని భోగట్టా. జగన్ భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. వైఎస్ జగన్ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
విజయమ్మ జగన్ కు వ్యతిరేకంగా మారడం సంచలనం అవుతోంది. విజయమ్మ తీరు మారే ఛాన్స్ అయితే లేదని భోగట్టా. షర్మిల సైతం కయ్యానికి కాలు దువ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. షర్మిల రాజకీయాల్లో సక్సెస్ సాధించే అవకాశాలు అయితే లేవని ఇప్పటికే పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చిందనే సంగతి తెలిసిందే. విజయమ్మ, షర్మిల తీరు మారకపోతే వైసీపీకి ఇబ్బందేనని చెప్పవచ్చు. మాజీ సీఎం జగన్ కు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ షాకులు తగిలే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.