బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. మంచిర్యాలలో వింత ఘటన?

praveen
శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి గురించి మీకు తెలుసా? ఈ తరానికి తెలియక పోవచ్చు.. కానీ ఆయన గురించి నిన్న, మొన్నటి తరానికి బాగా తెలుసు. మరీ ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ చేసిన "శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర" అనే సినిమా ద్వారానే ఆ మహానుభావుడి గురించి అందరికీ తెలిసిందని చెప్పుకోవచ్చు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారికి వీరప్పయాచార్యులు అనే పేరు కూడా ఉండేది. దాదాపు సా.శ.1608- సా.శ.1693 నేటికాలంలో సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించడంద్వారా ఆయన బాగా ప్రాచుర్యం పొందారు. మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువుగా ఆయనికి కొనియాడుతారు.
ప్రస్తుత వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లయ్య పల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి అయ్యారని చెబుతారు చరిత్రకారులు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామివారి వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది వీరబ్రహ్మేంద్రస్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు! అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి కూడా. అమ్మాయిలు సిగరెట్, మందులు తాగడం కావచ్చు, స్వలింగ సంపర్కం కావచ్చు, వావివరసలు లేకుండా జనాలు ప్రవర్తించడం కావచ్చు... ఇంకా అనేకం ఆయన చెప్పినట్టే జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అయితే జనాలు అనుకున్నట్టుగానే ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్టు తాజాగా ఓ సంఘటన ఒకటి జరిగింది.
అవును, ప్రస్తుతం ఆయన చెప్పినట్టే మా ఊరిలో కూడా జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామస్థులు. అవును, ఎల్లక్కపేట గ్రామంలో చోటుచేసుకున్న ఘటన.. చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అవును, తెల్లని ఆవులకు నల్లటి దూడలు పుట్టటం సర్వ సాధారణమైన విషయం. కానీ, నల్లని గేదేకు తెల్ల రంగున్న దూడ పుట్టడమనేది అత్యంత అరుదు. ఎల్లక్కపేటలో ఆ అరుదైన ఘటనే చోటుచేసుకుని.. అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ చోద్యం చూసినవారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: