ఏపీ: దీపావళి బ్లాస్ట్.. నిరుద్యోగ భృతి.. రూ.3000లకు చంద్రబాబు సిగ్నల్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ పలు రకాల నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మరొక హామీని సైతం అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే వేద విద్యను అభ్యసించేటువంటి ఎటువంటి ఉపాధి లేకున్నటువంటి కొంతమంది వేద పండితులకు సైతం రూ .3000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వడానికి సిద్ధమైనట్లు గెలుస్తోంది. దీపావళి సందర్భంగా అందుకు సంబంధించి జీవోను కూడా ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 600 మంది ఉన్నటువంటి వేద పండితులు ఉన్నట్టుగా దేవాదాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు వీరందరికీ కూడా ప్రతినెల 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చేందుకే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు దేవాదాయ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఇటీవల ఉత్తర్వులను కూడా జారీ చేశారట. ఈ విషయం పైన అటు వేద పండితులు కూడా ఆనందాన్ని తెలియజేస్తున్నప్పటికీ.. మరి కొంతమంది మాత్రం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇస్తానని చెప్పి కేవలం వేద పండితులకు మాత్రమే ఈ డబ్బులు ఇస్తున్నారా అంటూ విమర్శిస్తున్నారు.అలాగే ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ని సైతం అందించే విధంగా గ్యాస్ ఏజెన్సీలకు జీవోలను జారీ చేసిందట. రూ.811 రూపాయలు కట్టిన తర్వాత రెండు రోజులకి ప్రజల ఖాతాలో ఆ డబ్బు జమ అవుతుంది అంటు తెలిపారు.

ఈరోజు నుంచి ఈ నెల ఆఖరి ఒకటి ఆ తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి.. మరొకటి జులై కి మరొకటి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కచ్చితంగా ఒక ఉచిత సిలిండర్ ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటువంటి సమాచారాన్ని అయినా సరే కావాలి అంటే1967 టోల్ నెంబర్ కి ఫోన్ చేసి ప్రభుత్వం సహాయం పొందండి అంటూ తెలియజేస్తోంది ఏపీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: