ఏపీలో వైసీపీ పని అయిపోయిందా..? రెండో స్థానం కోసం పవన్ తహతహలాడుతున్నారా?

Chakravarthi Kalyan

రాజకీయాల్లో శూన్యత అన్నది ఒక్కోసారి ఉంటుంది. మరికొన్ని సార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఏపీలో అదే పని జరుగుతుంది అంటే జనసేన అధినాయకత్వం ఆలోచనలు చూసుంటే అదే అవును అనిపించేలా ఉంది. ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయ్యాక బాగా వీక్ అవుతోంది. ఆ పార్టీలోని నేతలు అంతా కూటమి వైపుగా సాగుతున్నారు.  ఇక వైసీపీలో ఉన్న వారిలో అత్యధికులు పార్టీలో ఉన్నారా లేదా అన్నట్లుగా ఉన్నారు.


వైసీపీలో జగన్ కి పార్టీ నేతల నిర్లిప్తత కొంత ఇబ్బందిని పెడుతోంది. పార్టీని పుంజుకునేలా చేయాలని ఎంత చూసినా నేతల నుంచి తగినంత స్పందన రావడం లేదు. మరో వైపు చూస్తే టీడీపీ కూటమి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వైసీపీని చిత్తు చేస్తోంది


టీడీపీ జనసేన రెండూ వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. జనసేన అయితే కొత్తగా నాయకత్వాన్ని నిర్మించుకోవాలని మొదట భావించింది. కానీ ఇపుడు మాత్రం ఆలోచనలు మారాయని అంటున్నారు. అలాగే ఆట తీరు మార్చింది అని అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చే బిగ్ షాట్స్ కి ఘన స్వాగతం పలకడమే కాకుండా డోర్స్ ఓపెన్ చేసింది. ఎందుకంటే పార్టీ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ బలోపేతం చేయడం మంచిదే కానీ అది లాంగ్ టెర్మ్ ప్రాసెస్. అదే టైం లో వైసీపీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే సంక్షోభంలో ఉంది.


దానికి క్యాష్ చేసుకోవడమే రాజకీయంగా ఉత్తమం అని జనసేన భావిస్తోంది. వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇచ్చినా మళ్ళీ బలంగా మారుతుందని అది జనసేన భవిష్యత్తు అలాగే పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతుందని భావించే చాలా మందిని వరసబెట్టి చేర్చుకుంటున్నారు అని అంటున్నారు.


ఇక మీదట కూడా మరింత మందిని వైసీపీ నుంచి ఆకర్షించే కార్యక్రమానికి జనసేన తెర తీస్తోందని అంటున్నారు.  జనసేనలో చేరడం వల్ల ఆ పార్టీ నేతలకు కూడా లాభంగానే ఉంది అని అంటున్నారు. వైసీపీ ఎంత బలహీనం అయితే అంతలా ఎదిగే పార్టీ ఏపీలో జనసేన మాత్రమే అని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: