జగన్ కు షర్మిల గురించి చెడుగా చెప్పింది అతనేనా.. ఆయనే గ్యాప్ పెంచారా?

Reddy P Rajasekhar
జగన్ షర్మిల మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతుండగా ఎవరు ఎంత కష్టపడినా రాజీ పడే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సన్నిహితంగా ఉండి గత ఎన్నికల్లో మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తన కొడుకుతో వైసీపీ సోషల్ మీడియాను నిర్వహించిన వ్యక్తే జగన్ షర్మిల మధ్య గ్యాప్ కు కారణమయ్యారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
 
ఆయన షర్మిల గురించి జగన్ లో విషాన్ని నింపి జగన్ కు షర్మిలకు మధ్య గ్యాప్ ను అంతకంతకూ పెంచేశారని తెలుస్తోంది. వైసీపీలో ఉన్న కీలక నేతలందరికీ ఈ విషయం తెలుసని సమాచారం అందుతోంది. జగన్, షర్మిల మధ్య గ్యాప్ రావడం పార్టీ నేతలను సైతం ఒకింత బాధ పెట్టింది. ఇలాంటి గొడవల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ షర్మిల తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారో లేక గ్యాప్ ను అంతకంతకూ పెంచుకుంటారో చూడాల్సి ఉంది. జగన్ షర్మిల మధ్య గ్యాప్ ను తగ్గించడం విజయమ్మకు తప్ప ఎవరికీ సాధ్యం కాదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ అధికారానికి దూరం చేసిన షర్మిలను క్షమించే ప్రసక్తే లేదని తన లేఖల ద్వారా అర్థమవుతోంది.
 
జగన్ షర్మిల తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నారు. జగన్ షర్మిల విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. జగన్ షర్మిల గురించి మాట్లాడటానికి కూడా పెద్దగా ఆసక్తి అయితే చూపడం లేదని తెలుస్తోంది. వైసీపీ రాబోయే రోజుల్లో పుంజుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పుంజుకోవడం ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే. కూటమిని ఓడించే సత్తా ఉన్న పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: