జమిలీ ఎన్నికలు: పక్కా ప్లాన్ తో పవన్ కళ్యాణ్.. కూటమిపై దెబ్బా..!
కేంద్రంలో బీజేపీ ఏపీలో టిడిపి తో పాటు చాలా రాజకీయ పార్టీలతో బిజెపి కూటమిగా ఉన్నది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 2029 దాకా అధికారాన్ని కొనసాగించకుండా జమిలి పాట పాడుతున్నది. అందుకే వీలైనంత త్వరగా జమిలి ఎన్నికలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం పుంజుకుంటోంది. ఒకవేళ ఏపీలో జమిలి ఎన్నికలు వస్తే ఏం జరుగుతుంది.. ఈసారి కూడా బిజెపి, జనసేన పార్టీలు అత్యధిక సీట్లను డిమాండ్ చేస్తాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
175 అసెంబ్లీ సీట్లలో కచ్చితంగా ఈసారి జనసేన పార్టీ 60 సీట్లు, బిజెపి పార్టీ 25 సీట్లు కోరుతారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీకి 90 సీట్లు మాత్రమే మిగులుతాయి అందులోనే పోటీ చేయవలసి ఉంటుంది.. 2024 ఎన్నికలలో టిడిపి 144 సీట్లలో పోటీ చేయక బిజెపి జనసేన 31 స్థానాలను పోటీ చేశారు. జనసేన పార్టీ కూడా తన బలాన్ని సైతం చూపించాలని విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నది. అందుకే వైసీపీ నుంచి కూడా చాలామంది నేతలను తమ పార్టీలోకి లాక్కుంటోంది జనసేన. ఒకవేళ బిజెపి కూడా తన హవా చూపించాలని ప్రయత్నాలు చేస్తోంది. మరి కూటమికి జనసేన బీజేపీ పార్టీలు దెబ్బేస్తాయో లేకపోతే చంద్రబాబు చెప్పిన విధంగానే వింటారో చూడాలి మరి.