ఏపీ: వైసిపి మహిళ.. జనసేన ఎంట్రీ పై.. భారీ ట్విస్ట్..!

Divya
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో భాగంగా వైసిపి పార్టీ ఓడిపోవడం జరిగింది.. దీంతో చాలామంది ఎంపీలు ,ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ,మాజీ ఎమ్మెల్యేలు, మేయర్స్ ఇలా అందరూ కూడా పార్టీని గుడ్ బై చెప్పి ఇతర పార్టీలలోకి వెళుతూ ఉన్నారు. ఇటీవలే వైసిపి కీలక మహిళ నేత వాసిరెడ్డి పద్మ కూడా వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలాంటి సమయంలోనే మరొక మహిళా నేత కూడా పార్టీకి రిజైన్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఆమె ఎవరో కాదు మాజీ హోంశాఖ మాజీమంత్రి.. పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత.. గత రెండు రోజుల నుంచి ఇమే జనసేన పార్టీలో వెళ్ళబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం పైన ఆమె క్లారిటీ ఇస్తూ ఒక ట్విస్ట్ ఇచ్చింది. తన రాజకీయ చివరి వరకు మాజీ సీఎం జగన్ తోనే కొనసాగిస్తానంటూ.. మేకతోటి సుచరిత, IRS మేకతోటి దయసాగర్ తెలియజేశారు. కేవలం కొంతమంది మీడియా ఛానల్స్ తమపైన ఇలాంటి ఊహాగానాలు సృష్టిస్తున్నారంటూ అవన్నీ ఎవరు నమ్మవద్దండి అంటూ తెలియజేశారు.

గతంలో కూడా తాము టిడిపి పార్టీలోకి చేరుతున్నామని దుష్ప్రచారం కూడా చేశారని.. అప్పుడు కూడా తాము వైసీపీ పార్టీలో కొనసాగుతామని క్లారిటీ ఇచ్చామని తెలిపారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో  రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చామని ఆయన మరణం తరం ఆయన కుమారుడు స్థాపించిన వైయస్సార్ సిపి పార్టీలో చేరామని.. నాటి నుంచి నేటి వరకు తాము క్రమశిక్షణ కలిగిన నాయకులుగా కొనసాగుతూనే ఉన్నామని తెలియజేశారు. అయితే తమ పైన వస్తున్న ఇలాంటి రూమర్లకు సైతం వ్యక్తి కౌంటర్ వేశారు మేకతోటి సుచరిత. అయితే ఇప్పటికే చాలామంది వైసిపి పార్టీని వీడుతున్నారన్నప్పటికి టిడిపి నుంచి కూడా వైసిపి పార్టీలోకి కొంతమంది చేరుతున్నారు. మరి ఎన్నికల దగ్గర సమయంలో ఎవరెవరు ఏ ఏ పార్టీలలో ఉంటారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: