భారత్ లో నిరుద్యోగానికి పరిష్కారం చెప్పిన ఐఎస్ఎఫ్ ఫౌండర్.. అలా చేయాలంటూ?

Reddy P Rajasekhar
ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో శరవేగంగా విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకున్న ప్రతి రంగంలో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. సరికొత్త ఆలోచనలతో ఎంతోమంది యువతీయువకులు తమ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నారు. ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తుల కలలకు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్( ఐఎస్ఎఫ్ ) అండగా నిలుస్తోంది.
 
ఐఎస్ఎఫ్ ఫౌండర్ ఛైర్మన్ జేఏ చౌదరి భారత్ లో నిరుద్యోగానికి పరిష్కారం చెబుతూ వెల్లడించిన విషయాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆవిష్కరణలు, వ్యాపార అవకాశాల సృష్టి ద్వారా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్టార్టప్ లను, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చని ఆయన సూచించారు. యువత సైతం టెక్నాలజీలో నైపుణ్యాలను వీలైనంత మెరుగుపరచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం యువతకు ప్రయోజనం చేకూరే విధంగా అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు వారి ఆలోచనలను వ్యాపారాలుగా మార్చే దిశగా ప్రోత్సహిస్తే నిరుద్యోగ సమస్యకు మెరుగైన పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం నిజంగా మార్పు తెచ్చే విధానం అని జేఏ చౌదరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్ లైన్ స్కిల్స్ ను పెంచుకోవడం ఎంతో ఇంపార్టెంట్ అని ఆయన పేర్కొన్నారు.
 
ఇప్పటికే ఉన్న స్టార్టప్ లకు సైతం నిధులు, నిపుణుల సహాయంతో పాటు వ్యాపార విస్తరణకు అవసరమైన మార్గదర్శకాలను తెలియజేస్తామని జేఏ చౌదరి వెల్లడించారు. మంచి ఆలోచనలతో మొదలైన స్టార్టప్ లు వృద్ధిలోకి రావడానికి, మార్కెట్ లో నిలబడటానికి సరైన మార్గదర్శనం అవసరమని తమ సంస్థ ద్వారా మెంటారింగ్, నెట్వర్క్ అవకాశాలు, పెట్టుబడిదారులతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ సైతం కల్పిస్తామని ఆయన అన్నారు. జేఏ చౌదరి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతున్నాయి. యువతలో కొత్త ఆశలు చిగురించేలా ఆయన కామెంట్లు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: