జనసేనలోకి మరో మహిళ నేత.. షాక్ లో జగన్ ?
ఇలాంటి నేపథ్యంలో వైసీపీలో కీలకంగా ఉన్న మరో మహిళా నేత జారుకునేందుకు రెడీ అవుతున్నారట. మాజీ హోం శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత... అతి త్వరలోనే పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్లబోతున్నారట. ఈ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి తో చర్చలు జరుగుతున్నాయట. ఆమెకు జనసేనలో కీలక పదవి ఇస్తారని కూడా... ప్రచారం జరుగుతోంది.
వాసవంగా మేకతోటి సుచరిత కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 సంవత్సరంలో ప్రతిపాడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు సూచరిత. అయితే... జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన అభిమానంతో వైసీపీకి వచ్చారు. 2011 సంవత్సరంలో వైసిపి పార్టీ ఏర్పాటు అయిన తర్వాత.. జగన్ పార్టీలో చేరిపోయారు మేకతోటి సుచరిత. ఈ తరుణంలోనే 2012 ఉప ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది.
ఇక 2014 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు మేకతోటి సుచరిత. ఇక... 2019లో మాత్రం వైసిపి నుంచి పోటీ చేసి సుచరిత గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఈతరణంలోనే హోమ్ మినిస్టర్ కూడా అయ్యారు సుచరిత. కానీ 2024 అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. కానీ సుచరితకు ఘోర ఓటమి ఎదురైంది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.