భర్తను అలా పిలవడం కూడా క్రూరత్వమే.. హైకోర్టు షాకింగ్ కామెంట్స్?
విషయం ఏమిటంటే, భర్తని ‘‘హిజ్రా’’(నపుంసకుడు) అని పిలవడం మానసికంగా క్రూరత్వాన్ని అతడిపైన చూపడమే అంటూ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. సదరు భర్తకి అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్థించింది. వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది జూలైలో ఫ్యామిలీ కోర్టు తన భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక మహిళ పిటిషన్ వేసింది. దానిని జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ, జస్టిన్ సుధీర్ సింగ్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ విచారించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ‘‘ఫ్యామిలీ కోర్టు చెప్పినదానిని బట్టి, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించిన పిదప, అప్పీలుదారు - భార్య యొక్క ప్రవర్తన క్రూరత్వానికి సమానం’’ అంటూ పేర్కొని విడాకులని మంజూరు చేయడాన్ని సమర్ధించింది.
భర్తను హిజ్దాగా పేర్కొనడం కావచ్చు, అతడి తల్లిని నపుంసకుడికి జన్మనించ్చిందని దూషించడం కావచ్చు... ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మానసిక క్రూరత్వానికి సంబంధంచిన విభాగంలోకి వస్తాయని కోర్టు పేర్కొంది. కాగా, ఈ జంటకు 2017లో వివాహం కాగా... భార్య చాలా ఆలస్యంగా నిద్ర లేస్తుందని, తన తల్లిని మొదటి అంతస్తులోని బెడ్రూమ్ లోకి భోజనం పంపమని అడిగేదని, తన తల్లి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా.. రోజుకు నాలుగైదు సార్లు పైకి పిలిచేదని భర్త కోర్టు ముందు వాపోయాడు. అదేవిధంగా తన భార్య పోర్న్ చూడటం అలవాటు చేసుకుందని, శారీరకంగా ఫిట్‌గా లేనని తనను వెక్కిరించేదని, నపుంసకుడు అని పిలిచేదని చెప్పగా కోర్టు అతడి మాటలను విశ్వసించింది.