ఏపీ: కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ బెంగ.. ఎన్ని కోట్లంటే..?
గెలుపు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ హామీలను సైతం కచ్చితంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వము అయితే నిర్ణయించుకున్నది. అందుకనే ఒక్కో పండుగకు ఒక్కో హామీను నెరవేర్చేలా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తీసుకోనంటూ సీఎం చంద్రబాబు ఇటీవలే తెలియజేశారు. పింఛన్ పెంపు వ్యవహారం ఇప్పటికే అమలు అయింది అని తెలిపారు. దీపావళి నుండి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అని.. ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందట.
ఇక ఆర్థిక శాఖ నిపుణులు సూపర్ సిక్స్ హామీల కోసం ఒక లెక్క వేయగా ఇందులో సుమారుగా 1.20 లక్షల కోట్ల రూపాయలు ఒక్కో ఏడాదికి అవసరమని అంచనా వేశారు. అయితే గత ప్రభుత్వం వైసీపీలో సంక్షేమ పథకాల కోసం ప్రతి ఏడాది 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కూటమి ప్రభుత్వం వీటి కంటే ఇప్పుడు అదనంగా మరొక 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉన్నది. మరి ఇంతటి నిధులు ఎక్కడి నుంచి తేవాలి అంటూ కూటమి ప్రభుత్వం తర్జనభజన పడుతోందట. ఒకవైపు కేంద్రం మరొకవైపు రాష్ట్రం నుంచి ఈ నిధులను ఎలా సేకరించాలని విషయం పైన ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. అలాగే రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్లు పోలవరానికి నిధులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉన్నది.. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ వంటివి చెల్లించాల్సి ఉన్నది. మరి ఇలాంటి సమయంలో సూపర్ సిక్స్ హామీలను ఏమవుతాయి చూడాలి మరి.