జమిలి ఎన్నికలకు సర్వం సిద్ధం.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!
దేశం మొత్తం కూడా 2027 ఫిబ్రవరి మాసంలో ఎన్నికలు ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సైతం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారం..83,85,174,172,356 వంటి రాజ్యాంగాన్ని సవరించాలి.. ఈ బిల్ యాక్సెప్ట్ అవ్వాలి అంటే కచ్చితంగా లోక్ సభ లో రాజ్యసభలో 67% మంది సపోర్ట్ చేస్తూ ఉండాలట.. 14 రాష్ట్రాలు అసెంబ్లీ సపోర్టు చేయాలని అలా అయితేనే ఈ బిల్లు పాస్ అవుతుందని ఈ బిల్లు రాజ్యాంగ పరిధిలోకి వస్తుందట.
అయితే జమిలి ఎన్నికల బిల్లుని 2024 శీతాకాలం పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.. ఒకవేళ ఈ పార్లమెంట్ ఎన్నికలకు మద్దతు లభించినట్లు అయితే 2027 ఫిబ్రవరిలోనే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తో పాటుగా దేశంలోని మొత్తం అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలకు సైతం ఒకేసారి నిర్వహించబోతున్నట్లు ఎన్నికలు తెలుస్తోంది. అలా ఎన్నికలు జరిగిన మూడు నెలల తర్వాత గ్రామపంచాయతీ ,మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగబోతాయట. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశం మొత్తం పరిపాలించడం చాలా సులువుతుందని కేంద్రమంత్రి ఫ్లహ్లద్ జోషి కూడా వెల్లడించారు.. ఇక ఈయన కూడా ఖచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని 2027 ఫిబ్రవరిలో అందరూ సిద్ధంగా ఉండాలని విధంగా ఒక విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం.