ఏపీ: వాలంటరీలకు బ్యాడ్ న్యూస్ టిడిపి నేత హాట్ కామెంట్స్

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సమక్షంలో ఇటీవలే టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలు పలు రకాల సమావేశాలను ముగించడం జరిగింది. ఈ సమావేశం రెండు సార్లు కొనసాగిందట.. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నానాయుడు వాలంటరీ వ్యవస్థ పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలతో వాలంటరీలు ఒకసారిగా సతమతమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఉచిత ఇసుక మీద మాట్లాడుతూ ఉచిత ఇసుక సంపూర్ణంగా అమలు చేస్తామని ఈ విషయం పైన అటు సీఎంతో కూడా మాట్లాడామని తెలిపారు. నేటి నుండి ఉచిత ఇసుక అమలు చేస్తున్నామంటూ తెలిపారు.

ఇసుకపై సెన్స్, వ్యాట్ వంటి పన్నులు ఇక ఉండవని ఎవరైనా ఎప్పుడైనా సరే ఇసుకను ఎక్కడి నుంచి అయినా తీసుకొని వెళ్ళవచ్చు అంటూ తెలిపారు. ఓవర్ లోడింగ్ అనే పేరుతో కేసులు కూడా ఉండవని తెలియజేశారు.. కానీ ఇసుకను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేస్తే మాత్రం పీడీ యాక్ట్ అమలు చేస్తామంటూ తెలియజేశారు. మద్యం వ్యాపారంలో కూడా ఎవరు ఎక్కడ జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు తెలిపారని తెలిపారు. ఇక వాలంటరీ వ్యవస్థ పైన మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థ 2023లోనే అప్పటి సీఎం ఆపేశారు అంటూ బాంబు పేల్చారు.

మరి అప్పటినుంచి లేని వాలంటరీలు ఇప్పుడు మేము ఎలా జీతాలు ఇస్తామని తెలిపారు.. రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం అప్పులను మాత్రమే మిగిల్చిందని 2024 ఎన్నికలలో కూటమి వస్తే వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారని తెలిపారు అచ్చెన్నానాయుడు. కానీ వాలంటీలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం చేస్తామని కూడా తెలిపారు కానీ ఎన్నికల సమయంలో చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారని మరి కొంతమంది విధులలో ఉన్నారని వెల్లడించారు.. మొత్తానికి వాలంటరీ వ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యలతో వాలంటరీలు కాస్త ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. మరి పూర్తి విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: