తక్కువ భూమి ఉండే రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. మరో పథకం..!

Divya
మన దేశంలో సుమారుగా చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగానే పలు రకాల సాంకేతిక పరికరాలు సైతం అందుబాటులోకి రావడంతో వ్యవసాయం చాలా సులభంగా మారుతున్నది. కానీ అధిక ధరలు ,పెట్టుబడులు, మందులు, కూలి వాసులు ధరలు పెంచడం వంటివి చేయడంతో వ్యవసాయం చాలా భారంగా మారుతున్నది. దీంతో అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయదారులకు తోడ్పడు అందించడంలో అవసరమైన రాయితీలను కూడా అందిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించింది. అయితే ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది 6000 రూపాయలు కేంద్రం నుంచి అందుతుంది. అయితే ఇప్పుడు తాజాగా మరొక కొత్త పథకాన్ని తీసుకువస్తుందట.. 5 ఎకరాల భూమి కంటే తక్కువగా ఉన్న రైతులను ప్రోత్సహించడానికి కిసాన్ ఆశీర్వాద్ అనే పథకం రైతులకు వరంగా మారనుందట. వీరి వ్యవసాయ భూమి పరిమాణం ఆధారంగా డైరెక్ట్ గా ఆర్థిక సహాయాన్ని అందించడానికి సిద్ధమవుతోందట కేంద్ర ప్రభుత్వం. ఐదు ఎకరాల లోపు భూములు ఉన్న రైతులకు సైతం వారి ఖాతాలు 25వేల రూపాయలు జమ చేయబోతున్నారట.

నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు 20,000 రెండు ఎకరాలు ఉన్నవారికి 10,000 జమ చేయబోతున్నారట ఈ కిసాన్ ఆశీర్వాద్ అనే పథకాన్ని త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ ఐదు ఎకరాల లోపు ఉన్న వారందరికీ పిఎం కిసాన్ తో కలుపుకుంటే సుమారుగా 31,000 అందిస్తారట. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హతలు కావాలి అంటే..
ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, భూమి యాజమాన్య పత్రాలు, మొబైల్ నెంబర్ పాస్పోర్టు వంటివి ఉండాలి.
Pm-kison చొరవతో 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందట. గ్రామీణ ప్రాంతాలలో అభ్యున్నతికి వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ పథకం కీలకంగా మారుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: