ఏపీ: జనసేన పార్టీలోకి వెళ్లిన వైసీపీ నేత.. ఒంటరేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలు కొంతమంది మనం ఎంత చెబితే అంత మనం ఏం చెబితే అదే పవర్ ఉన్నా లేకున్నా అనే విధంగా నేతలు వ్యవహరిస్తూ ఉంటారు అలాంటి వారిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. ఏ పార్టీ అయినా సరే తన పేరు చెబితే చాలు రెడ్ కార్పోరేట్ వేసి మరి ఆహ్వానం పలుకుతూ ఉంటారని చెబుతూ ఉంటారు. అలా తన జిల్లాలో తన బ్రాండ్ తో ఏం చేసిన అది శాసనంగా మారుతుంది అనుకున్నారు. తను పోటీలో లేకపోతే రాజకీయాలలో తమ నియోజకవర్గంలో హైప్ లేదనే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అదంతా మారిపోయింది అక్కడ పరిస్థితి వేరే రకంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో వైసిపి లో మాజీ మంత్రిగా పనిచేసిన ఈయన.. వైసిపి పార్టీ 2024లో ఓడిపోవడంతో వైసిపికి పవర్ అయిపోయిందని ఇటీవల జనసేన పార్టీలోకి వెళ్లి గ్లాస్ పట్టుకున్నారు. కూటమి నేతలు మాత్రం బాలినేని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అయినా ఎలాగోలాగా జనసేన పార్టీలోకి చేరిన అంతా సెట్ అవుతుందనుకున్నప్పటికీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మాజీ మంత్రి బాలినేని పరిస్థితి ఇప్పుడు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారట. ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యతిరేకించినప్పటికీ.. చివరికి జనసేన పార్టీలోకి చేరిన తర్వాత బాలినేనికి అసలు పరిస్థితి అర్థం అవుతోందట.

ముఖ్యంగా అక్కడ నేతలు సభ్యత లేదని సొంత నియోజకవర్గంలోనే ఫ్లెక్సీ ల మీద తన ఫోటో చూసుకొని పరిస్థితి లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఒంగోలులో సభ పెడుతున్న బాలినేని సైలెంట్ గా ఉన్నారట. అంతేకాకుండా ఒంగోలులో ఎలాంటి ఫ్లెక్సీలలో కూడా బాలినేని పేరు గాని ఫోటో గాని ఎక్కడ కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఒంగోలులో బాలినేని ఒంటరిగా మారినట్టు కనిపిస్తోంది. జనసేన పార్టీలోకి వెళ్లి తమ హవా చూపించాలనుకున్న కానీ అది కుదరడం లేదని తన అనుచరులతో వాపోతున్నట్లు సమాచారం. బాలినేని జనసేన పార్టీలోకి చేరడంతో తన అనుచరులను పట్టించుకోలేదని టాక్ వినిపిస్తోంది. మరి బాలినేని జనసేన పార్టీలోకి వెళ్లడానికి ముఖ్య కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారం, మైనింగ్ భూములు, కేబుల్ వ్యాపారాలలో దెబ్బతినేలా జరుగుతుందని భయంతోనే ఈయన జనసేన పార్టీలోకి చేరారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతమైతే బాలినేని ఒంటరిగా అయిపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: