రతన్ టాటా ఆర్థిక సూత్రాలు.. పాటిస్తే మీరు గొప్పోళ్ళు కావొచ్చు?
అందుకే వ్యాపార రంగంలో రాణించాలి అనుకునే ఎంతో మందికి ఆయన కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ఆయనచెప్పిన ఆర్థిక సూత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం..
నైతికత : డబ్బులు సంపాదించడం వ్యాపారవేత్తలు ఎవరైనా చేస్తారు. కానీ ఆ డబ్బును నైతికతతో న్యాయంగా సంపాదిస్తే.. ఇక ఉన్నన్ని రోజులు ఆర్థికంగా విజయం సాధిస్తూనే ఉంటాం అని రతన్ టాటా చెప్పారు చెడు మార్గంలో తొందరగా డబ్బును కూడా కూడగట్టుకోవాలనుకుంటే పతనం తప్పదు అంటూ ఆయన సూచించారు.
ఇవ్వడం నేర్చుకోవాలి : మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడే తిరిగి అలాంటివే మన దగ్గరికి వస్తాయని రతన్ టాటా బలంగా నమ్ముతారట. మంచి పనులు డబ్బు ఈ రెండింటికి ఈ సూత్రం వర్తిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే మీరు డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు చేయడం నేర్చుకోవాలట.
అవకాశాలను అందిపుచ్చుకోవడం : అన్ని సజావుగానే ఉన్నాయి కదా అనే ధోరణి నుంచి బయటపడి ఇక డబ్బు వృత్తి విషయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రతన్ టాటా సూచించారు. మిగతా వారి కంటే భిన్నంగా ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.
నిర్ణయాలను గౌరవించడం : ముందుగా ప్రతి ఒక్కరు వారు వారు తీసుకునే నిర్ణయాలపై ఎక్కువ విశ్వాసం పెట్టాలట. అవి మంచివా చెడువా అనేది తర్వాత విషయం.. ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి ఆలోచించాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద నిలబడాలి అంటూ రతన్ టాటా సూచించారు.
తెలివిగా పెట్టుబడులు : ఒకచోట పెట్టుబడులు పెట్టడం వల్ల డబ్బులు సంపాదించే అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే మిగతా వారితో పోల్చి చూస్తే వైవిధ్యానికి పెద్ద పీట వేయాలని ఆయన సూచించారు. అంటే ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుందని తెలిపారు.