ఇక జమీలీకి లైన్ క్లీయర్... జమిలీ పోరు ఎప్పుడంటే...!
దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికలకు వళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ గత ఐదు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు జెమిని ఎన్నికలకు బిజెపి వెళ్లేందుకు మరో అడుగు ముందుకు పడింది. హర్యానా ఫలితాలు ఇందుకు ఊతం ఇచ్చాయి అని చెప్పాలి. జెమిలీ ఎన్నికలపై చాలా కాలంగా బిజెపి ఉత్సాహం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా మోడీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీకి నివేదిక కూడా అందజేపింది. తాజాగా హర్యానా - జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చే సింది. అసలు రెండు రాష్ట్రాలలో బిజెపి ఓడిపోతే జెమిలీ ఎన్నికలకు వెళ్లే విషయమై బిజెపి కాస్త వెనకడుగు వేస్తుందేమో అని అందరూ అనుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో అందరూ అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
హర్యానాలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ముచ్చటగా మూడోసారి బిజెపి ప్రభుత్వం కొలువుదిరింది. దీంతో బిజెపిలో ఇప్పుడు జెమిలీ ఎన్నికలపై ఉత్సాహం ఉరకలు వేస్తోంది. హర్యానా ఫలితాలు సరికొత్త జోష్ ఇచ్చాయి.. జెమిలీ ఎన్నికలకు మరో రెండు మూడేళ్లలో బీజేపీ వెళ్లిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోసారి జాతీయ స్థాయిలో అధికారాన్ని దక్కించుకోవడానికి ఇప్పుడే సరైన వాతావరణం ఉందని ... హర్యానా ఫలితాలతో బిజెపి చాలా నమ్మకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మోడీ సర్కార్ .. నితీష్ కుమార్ - చంద్రబాబు మద్దతుతో నడుస్తోంది. వాళ్ళిద్దరికీ కోపం వస్తే మోడీ సర్కార్ పడిపోక తప్పదు. ఈ నేపథ్యంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనతో బిజెపి ఉంది. ఇందుకోసం జెమిలీ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనకు హర్యానా ఎన్నికల ఫలితాలు బలం కలిగిస్తున్నట్టు దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఇది ఏమైనా రానున్న రోజులలో జాతీయ స్థాయిలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.