చిక్కుల్లో జగన్.. జైలులోనే బాబును చంపేందుకు కుట్రలు..డ్రోన్లు ఎగరేసి మరీ?
తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు ... జైలు మీద డ్రోన్లు కూడా ఎగురవేశారని కూడా పేర్కొన్నారు. నా ప్రతీ కదలిక గమనించటానికి జైలు గదిలో సీసీ కెమెరా కూడా పెట్టారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కనీసం వేడి నీళ్లు ఇవ్వలేదు, దోమలు కుడుతుంటే కనీసం దోమ తెర కూడా ఇవ్వలేదని జగన్ ను టార్గెట్ చేశారు.
ఇంత అనుభవించిన నేను.. బయటకు రాగానే ముందు కక్ష తీర్చుకోవాలి కదా? అని ప్రశ్నించారు. నాది ఆ స్వభావం కాదన్నారు. గత 5 ఏళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు నాకు తెలుసని తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు, సరైన సమయంలో చర్యలు ఉంటాయని వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 30 జిల్లాల ఏర్పాటు అని తిరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కూడా వెల్లడించారు. మార్కాపురం, మదనపల్లె, ముంపు మండలాలకు సంబంధించి హామీలు ఉన్నాయి, అది ఇప్పుడే కాదన్నారు. తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలపై ఓపిక పడుతున్నానని చెప్పుకొచ్చారు.
దురుద్దేశాలు, దుష్ప్రచారాలు తొలుత ఎక్స్ పోజ్ చేయాలని కోరారు. మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసన్నారు. తక్షణ చర్యలు సరైన విధానం కాదని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం చాలామంది అధికారులతో తప్పులు చేయించిందన్నారు. అందర్నీ పక్కనపెడితే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ అధికారులు కూడా తక్కువేనని తెలిపారు. వాణిజ్య పన్నులకు ఇంత వరకు కమిషనర్ ని ఇవ్వలేకపోయానని వివరంచారు. 2-3పోస్టులు ఒకరితోనే పని చేయిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.