జగన్ ని దెబ్బ కొట్టిన సోషల్ ఇంజినీరింగ్? వైసీపీని వీడుతున్న బీసీ నేతలు?

Chakravarthi Kalyan

వైసీపీ, తమ రాజ్యసభ సభ్యత్వాలకు ఇటీవల రాజీనామా చేసిన కీలక నేతలు.. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తాజాగా సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరువురు నేతలకు ఆయన  పార్టీ కండువా కప్పి సైకిల్ ఎక్కించారు.


ఈ  సందర్భంగా మోపిదేవి, బీదలు చంద్రబాబుని కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అయితే వాస్తవానికి.. మోపిదేవి ఆది నుంచి కూడా టీడీపీలోనే చేరతానని చెప్పారు. కాబట్టి మోపిదేవి విషయం పెద్ద చర్చనీయాంశం కాదు. పైగా ఆయన పార్టీలో చేరకుండానే పలు టీడీపీ కార్యక్రమాల్లోను ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా కండువా మార్చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


దీనికి ముందే  మోపిదేవి తాను పార్టీలో చేరనున్నారని చెప్పుకొచ్చారు. కానీ బీద మస్తాన్ రావు విషయంలో మాత్రం కొంత గందరగోళం ఏర్పడింది. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా అయితే చేశారు కానీ.. ఏ పార్టీలో చేరేది అప్పట్లో వెల్లడించలేదు. దీంతో ఆయనకు ఉన్న వ్యాపారాలు, కేంద్రంలో ఉన్న పలుకుబడి నేపథ్యంలో బీజేపీ బాట పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ నెల్లూరు చెందిన బీదను టీడీపీలోకి తీసుకువచ్చేందుకు అక్కడి మంత్రి నారాయణ తీవ్రంగా కృషి చేసినట్లు తెలిసింది.


ఈ క్రమంలోనే ఆయన మనసు సైకిల్ ఎక్కారు. ఇదిలాఉంటే బీద మస్తాన్ రావు, బబీద రవిచంద్ర యాదవ్ లు.. ఆది నుంచి కూడా టీడీపీలోనే ఉన్నారు. మస్తాన్ రావు గతంలో ఎంపీగా విజయం కూడా సాధించారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన వైసీపీ బాట పట్టారు. ఆయన సోదరుడు రవి చంద్ర మాత్రం టీడీపీలోనే కొనసాగారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి, బీద లతో ఇప్పుడు టీడీపీ మరింత బలమైన బీసీ శక్తిగా అవతరించిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: