ఏపీ: పవన్ కళ్యాణ్ రెండేళ్లలో సీఎం.. బాబోరుకు వెన్నుపోటేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో టిడిపి కూటమి ప్రభుత్వం కూటమిగా ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు ఇబ్బందులు ఎదురు కాకుండా చాలా ప్రశాంతంగానే  ప్రభుత్వాన్ని నడుపుతూ ముందుకు తీసుకు వెళుతున్నారు అటు సీఎం చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్. అయితే ఇదే కూటమిలో బిజెపి పార్టీ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో తమ అధికారాన్ని కూడా వ్యాప్తి చెందేలా ప్లాన్ చేస్తున్నారని అది కూడా పవన్ కళ్యాణ్ వల్ల లోలోపల చురుకుగా పావులు కలిపేలా ప్లాన్ చేస్తున్నారంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పలు ఆరోపణలు సైతం చేయడం జరుగుతోంది.

అందుకు సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ ను కూడా ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారని.. ఇటీవలె నెల్లూరు జిల్లాలో జరిగిన సిపిఎం మహాసభలో ఆయన మాట్లాడడం జరిగింది. కూటమి విచిన్నం కావడానికి కేంద్ర స్థాయిలో నుంచి ఒక కుట్ర జరుగుతోందనే విధంగా సిపిఎం నేత ఫైర్ అయ్యారు.ఈ విషయంలో బిజెపి పవన్ కళ్యాణ్ ని ఒక పావుగా ఉపయోగించుకుంటోందని అంటూ వెల్లడించారు. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా bjp,RSS ట్రాప్ లో పడిపోయారని విమర్శించారు.

డిప్యూటీ సీఎం వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా నష్టం వచ్చేలా  ఉందంటూ వెల్లడించారు.. అందుకే ఆంధ్రప్రదేశ్లో మతపరమైన ఉద్రికతలను సైతం తీసుకువచ్చేలా చేస్తున్నారని ఇందులో బిజెపి ఆర్ఎస్ఎస్ బండి పాత్రలు చాలా కీలకంగా ఉన్నాయంటూ తెలిపారు. దీన్నిబట్టి చూస్తే రాబోయే రెండేళ్లలోని చంద్రబాబుని సీఎంగా దింపేందుకే కుట్ర జరుగుతోందనే విధంగా ఇది బిజెపి మాస్టర్ ప్లాన్ అంటూ సిపిఎం నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డు ప్రసాదాల విషయంలో విద్వేషాలు సృష్టించే విధంగా ఉందని తెలియజేశారు. ఒకవేళ ఇలాంటి విద్వేషాలు జరిగితే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలుగా మారిపోతుందని ఆయన హెచ్చరించారు. అయితే ఇలాంటి సమయంలోనే సీఎం చంద్రబాబుని గద్దె దించడం సాధ్యమేనా అని ప్రశ్న కూడా తలెత్తుతోంది.మరికొందరు మాత్రం చంద్రబాబుని సీఎం చేసింది పవన్ కళ్యాణ్ అలాంటిది ఆయనను వెన్నుపోటు పొడుస్తారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేతలు. చంద్రబాబును వెన్నుపోటు పవన్ కళ్యాణ్ పొడుస్తాడా లేకపోతే ఏంటి అన్న సంగతి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: