ఏపీ: జగన్ కుమార్తెలు రాజకీయాల్లో చక్రం తిప్పుతారా..?

praveen
* ఏపీ రాజకీయాల్లో జగన్ కూతురులో చక్రం తిప్పేలా ఉన్నారు  
* జగన్ కి అండగా వారు నిలిచే అవకాశం
* 2029 ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మనవరాళ్ళైన హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలు రాజకీయాల్లోకి వస్తారా అని ఎప్పటినుంచో ఒక డౌట్ ఏపీ ప్రజల్లో తలెత్తుతోంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతి దంపతుల కుమార్తెలు వీరు. బలమైన కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, ఈ అమ్మాయిలు ఎప్పుడూ కూడా షో చేయరు. ప్రగల్భాలు పలకకుండా చాలా సింపుల్‌గా లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఎప్పుడూ మెచ్యూరిటీని కనబరుస్తుంటారు.
హర్ష రెడ్డి ఫ్రాన్స్‌లోని ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కూడా ఉద్యోగం చేసినట్లుగా తెలుస్తోంది. హర్ష యూకేలోని హానర్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు. హర్ష, వర్ష ఇద్దరూ చాలా తెలివైనవారు. చదువుల్లో ముందు నుంచి రాణించేవారు. అచ్చం తమ తాత అయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి లాగానే కూల్‌గా ఉంటారు. బ్రిలియంట్ గా ఆలోచిస్తారు. తాతని చూసి విపరీతంగా పుస్తకాలు చదవడం కూడా నేర్చుకున్నారు. జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి లండన్‌లోని కింగ్స్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు.
 చదువులు పూర్తయి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 2029 ఎన్నికల సమయానికి వీరిద్దరూ ఏపీ రాజకీయాలు యాక్టివ్ అయిపోవచ్చు అని కొందరు పేర్కొంటున్నారు. తండ్రికి అండగా రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ అమ్మాయిలు  పొలిటికల్ ఎంట్రీ ఇవ్వచ్చు అని ఊహాగానాలు వస్తున్నాయి. వీరిద్దరూ చాలా తెలివైన వాళ్లే లేకపోతే పెద్దపెద్ద యూనివర్సిటీలలో ఛాలెంజింగ్ డిగ్రీలు పూర్తి చేసి ఉండేవారు కాదు.
ఇంత తెలివైన వాళ్లు రాజకీయాలను ఈజీగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలో వీరికి తెలుస్తుంది. సొంత చెల్లి, బాబాయ్ కూతురు వ్యతిరేకమైన తర్వాత జగన్ కి ఎవరూ కూడా అండగా లేరు విజయమ్మ కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయంలోనైనా జగన్ కి తనకంటూ ఎంతోకొంత సపోర్టు ఉండాల్సిన అవసరం ఉంది ఆ సపోర్టు కూతుర్లు అందించొచ్చు. అంతేకాదు వారు. రాజకీయాల్లో చక్రం కూడా తిప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: