ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌నుమ‌రుగు... కొత్త కార్పోరేష‌న్ రూపురేఖ‌లు ఇవే..!

RAMAKRISHNA S.S.
- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .
దేశవ్యాప్తంగా ఎన్నో మహానగరాలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ మహానగరం అంటే తెలుగులోని క్రేజ్ దేశంలో ఢిల్లీ - ముంబై - చెన్నై తర్వాత.. ఆ క్రేజ్ హైదరాబాద్‌కే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. దేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో పూర్తిగా ఉంది. అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కనుమరుగు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రోడ్డు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 1.50 కోట్లకు చేరిందని.. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిని నాలుగు కార్పొరేషన్లగా విభజించడానికి రంగం సిద్ధం చేసినట్టు వెంకటరెడ్డి తెలిపారు. ఇకనుంచి హైదరాబాదులో నలుగురు మేయర్లను చూస్తారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దుతామని.. నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టేందుకు 30 వేల కోట్లతో రీజినల్ రింగ్‌రోడ్ నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో ఒక సీటు కూడా రాలేదు. బీఆర్ఎస్‌కు అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇది అధికారం లోకి వ‌చ్చినా కాంగ్రెస్ పెద్ద ఎదురు దెబ్బే అయ్యింది.

ఈ క్రమంలోనే.. హైదరాబాదులో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నగరంలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవాలని ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. మరోవైపు హైడ్రా కూల్చివేతలతో కాంగ్రెస్ పార్టీ నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక నగరం అంతా ఒకే కార్పొరేషన్ పరిధిలో ఉండడంతో.. అన్ని డివిజన్లో సమానంగా అభివృద్ధి చెందటం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు కార్పొరేషన్లుగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన‌ నిర్ణయం తీసుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: