చంద్రబాబు పొలిటికల్ అదృష్టవంతుడు... దేశంలోనే ఎవ్వరికి లేదుగా...!
నిజం అయింది. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ 14 ఏళ్లపాటు మాత్రమే అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నుంచి పార్టీ తీసుకున్న చంద్రబాబు మూడు దశాబ్దాలుగా టిడిపి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ తరానికి టిడిపి సంస్థాపకుడు ఎవరు అంటే చంద్రబాబు అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా ఆయన రాజకీయాలలో పెనవేసుకు పోయారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి కావటం అన్నది కూడా తెలుగు రాజకీయాలలో ఎవరికి లేని అదృష్టమే. ఇవన్నీ చూసిన చంద్రబాబు సమకాలీనుడు. కేంద్ర మాజీ మంత్రి చింతామణి.. చంద్రబాబు కంటే రాజకీయ అదృష్టవంతుడు ఎవరూ లేరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
చింతామణి.. చంద్రబాబు ఒకప్పుడు సమకాలీనలు. చంద్రబాబు తనకు ఐదు దశాబ్దాలుగా తెలుసు అని చింతామణి అన్నారు. ఈ రోజున దేశ రాజకీయాలే ఆయన చుట్టూ తిరుగుతున్నాయని బాబు తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు.. అంతటి రాజకీయ శక్తి ఆయనకు ఉందని చింతామణి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని.. స్టీల్ ప్లాంట్ కార్మికులు.. వారి డిమాండ్ల కోసం చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తే అలాంటి ప్రైవేటీకరణ వెంటనే ఆగుతుందని సలహా ఇచ్చారు. ఏది ఏమైనా చంద్రబాబు గొప్పతనాన్ని ఆయన సన్నిహితుడు ఆయన చింతామణి చాలా క్లియర్గా చెప్పారని చెప్పాలి.