కూటమికి ఎదురుదెబ్బ...తిరుమల లడ్డూపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..?

Veldandi Saikiran
తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు లడ్డు విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకుగాను... స్వతంత్ర దర్యాప్తు టీం ను ఏర్పాటు చేయాలని.. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఐదుగురు సభ్యులతో  కూడిన సిట్ ను ఏర్పాటుచేసి... తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో ఆధారాలను.. వెలికి తీయాలని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులలో... ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు ఉండాలని పేర్కొంది.  అలాగే సిట్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారాలు ఉండాలని తెలిపింది.  ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ నుంచి కూడా ఒక నిపుణులు కచ్చితంగా ఉండాలని పేర్కొంది. మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ సిట్ ఏర్పాటు కావాలని.. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఇక ఈ విచారణ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో.. మాత్రమే జరగాలని తెలిపింది. ఈ సిట్ విషయంలో ఎవరు జోక్యం చేసుకోకూడదు అని... స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ఈ తిరుమల శ్రీవారి వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని... తమ కోరుకోవడం లేదని సుప్రీంకోర్టు వెల్లడించడం గమనార్హం.రాజకీయంగా తిరుమల తిరుపతి లడ్డు విషయంలో వాఖ్యలు చేయొద్దు కూడా వెల్లడించింది సుప్రీం కోర్టు.

ఇక ఇవాళ తిరుమల శ్రీవారి లడ్డూ వివాద పిటీషన్‌ పై సుప్రీం కోర్టులో... టిటిడి తరఫున సిద్ధార్థ లూద్రా, ఏపి ప్రభుత్వం తరఫున ముకుల్ రోత్గి వాదనలు వినిపించారు. టిటిడి మాజీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించడం జరిగింది. సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా తానే వాదనలు వినిపించారు. అయితే.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ సంబరపడిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: