అసలు పవన్ దీక్ష వెనకాల అసలు కారణం అదా?

praveen

ఏపీలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం వివాదం నేపధ్యంలో పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న విషయం తెలిసినదే. లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనే నెపంతో గత వైసీపీ పాలకులు చేసిన తప్పుకి జనసేనాని, డిప్యూటీ సి‌ఎం పవన్ కల్యాణ్ ఈ దీక్ష చేపట్టిన సంగతి అందరికీ తెలుసు. అయితే ఇపుడు అదే చాలమందికి అనుమానం రేకెత్తిస్తోంది అని గుసగుసలు వినబడుతున్నాయి.
ఎందుకంటే, ఇంతవరకు ఆ వివాదం పైన సరియైన ఆధారాలు లేవు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందా? అనే విషయం పైన పరీక్ష జరగకుండానే సి‌ఎం బాబు ఇలా ఆ విషయాన్ని వివాదం చేయడం తగదని సుప్రీం కోర్టు ధర్మాసనం తాజాగా టీటీడీకి మొట్టికాయలు వేయడం జరిగింది. దాంతో ఇది కేవలం రాజకీయ విమర్శగానే ఉందని కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దాంతో పవన్ కల్యాణ్ అవాక్కయ్యారని వినికిడి. బాబు మాటలకు అనవసరంగా ఆవేశం తెచ్చుకొని దీక్ష చేపట్టానంటూ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అవును మరి, లడ్డూ ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగి భక్తుల మనోభావాలతో పాటు ఆ దేవుడికి అపచారం జరిగితే ఎలాంటి ప్రాయశ్చిత్త దీక్ష చేసినా దానిలో అర్థం ఉంటుంది. ఏపీ సి‌ఎం బాబు ఆరోపణలు పట్టుకొని డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ హడావుడిగా ప్రాయశ్చిత్త దీక్ష ప్రకటించి కాషాయం కట్టడం ఏం బాలేదంటూ విమర్శలు వస్తున్నాయి. అంతవరకూ ఎందుకు? సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ప్రాయశ్చిత్త దీక్షను తప్పు పట్టిన సంగతి విదితమే. అసలు నిజానిజాలేమిటో తెలుసుకోకుండా బాబు వుస్కో అంటే జనసేనాని టిస్కో అనడం ఏం బాలేదని ఇపుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో పవన్ కల్యాణ్ బాగా ఆలోచన చేసి ఆచరిస్తే ఇపుడు విమర్శలు తప్పేవని అంటున్నారు. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో కింద తెలియజేయండి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: