యువతకు భారీ గుడ్ న్యూస్.. కేంద్రం ప్రతినెల రూ.5000..!
ఇంటర్న్ షిప్ స్కీం కింద 2024 బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిత సన్న హాలు కూడా చేస్తున్నారట కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్లాన్ ని వచ్చే నెలలో ఎప్పుడైనా కూడా ప్రారంభించవచ్చని సమాచారం. ఈ పథకం ప్రయోజనం పొందాలి అంటే యువతకు కొన్నిటిని పాటించాలట. అయితే ఈ పథకం పొందడం కూడా చాలా కష్టం అన్నట్లుగా తెలుస్తోంది..
ఎందుకంటే ఈ పథకం కింద 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారి అర్హులట. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించి ఉండకూడదట.. అలాగే డిగ్రీ కోర్సు లేదా ఉద్యోగానికి సంబంధించి ఇంటర్నెట్ షిప్ పథకంలో భాగంగా కాలేరు. అయితే ఆన్లైన్ కోర్సులు లేదా వృత్తి శిక్షణలో మాత్రమే పాల్గొనేలా ఉంటుందట. కార్పొరేట్ ప్రపంచ అవసరాలకు సైతం అనుగుణంగానే ఈ నైపుణ్య అభివృద్ధి ద్వారా యువతకు సైతం ఉద్యోగాలు ఉపాధి కల్పించ కార్యక్రమానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందట. ఈ సమస్త కింద చాలా కంపెనీలు కూడా ఉంటాయని యువతకు శిక్షణ ఇచ్చి మరి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ కంపెనీలు సహాయం చేస్తాయట. ఈ పథకం కింద యువతకు నెలకు 5000 రూపాయలు అందించడమే కాకుండా కంపెనీల సిఎస్ఆర్ ఫండ్ కింద 500 రూపాయలు అందించి ప్రభుత్వం నుంచి 4500 అందిస్తుందట.