క్రికెట్ లో రాణించిన ఒంటి కన్ను'పులి'..రాజకీయాల్లో మాత్రం.!?

FARMANULLA SHAIK

* పిన్న వయసుల్లో ప్రపంచ రికార్డ్ సొంతం.!
* 1961లో వ్యక్తిగత జీవితంలో విషాద ఛాయలు.!
* 1971 రాజకీయాల్లో ఓటమి..!
భారతదేశం సృష్టించిన గొప్ప క్రికెట్ కెప్టెన్లలో 'టైగర్' అనే ముద్దు పేరు కలిగిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ భారత్‌లో అత్యుత్తమ భారత మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఆయన భారత్‌లో అత్యుత్తమ కెప్టెన్ అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఆయన జనవరి 5, 1941న బ్రిటిష్ ఇండియాలోని భోపాల్ రాష్ట్రంలోని భోపాల్‌లో జన్మించారు.అతను కేవలం 21 సంవత్సరాల వయస్సులో భారత జట్టు ప్రస్థానాన్ని చేపట్టాడు.పటౌడీ బ్యాటింగ్   మరియు కెప్టెన్సీ పరంగా విప్లవకారుడు అనే చెప్పాలి.అతను తన కెరీర్‌లో కఠినమైన మరియు స్థిరమైన సవాళ్లతో పోరాడాడు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లందరికీ ప్రేరణగా కొనసాగాడు.తాను క్రికెట్ఆటకు శైలి మరియు ఆకర్షణను తీసుకు రావడంతో పాటు తాను ఆడుతున్న రోజుల్లో భారత క్రికెట్ యొక్క కల్ట్ ఫిగర్ మరియు నేటికీ అలాగే కొనసాగేలా చేసాడు.
పటౌడీలది నవాబుల వంశం.తన పదకొండవ పుట్టిన రోజునాడే తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్ మరణించడంతో భోపాల్, పటౌడీ ప్రాంతాలకు మన్సూర్‌ను నవాబ్‌గా ప్రకటించారు.ఇంగ్లండ్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లినప్పటి నుంచే జూనియర్ పటౌడీలో క్రికెట్ సత్తా బయటపడింది.1959లో స్కూల్ కెప్టెన్గా వ్యవహరించి వెయ్యికి పైగా పరుగులు సాధించి రికార్డు బద్దలు కొట్టాడు అలాగే యూనివర్సిటీ స్థాయిలో ఆక్స్ఫర్డ్  జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన తొలి భారతీయుడయ్యాడు.అయితే అలాంటి జోరు మీద ఉన్న పటౌడికి 1961 లో అతని జీవితంలో విషాదం ఛాయలు చోటుచేసుకున్నాయి.రోడ్డు ప్రమాదంలో తన కుడికన్ను కోల్పోయాడు దాంతో మన్సూర్ క్రికెట్ కెరియర్ ముగిసింది అని అంతా అనుకునే లోపే మన్సూర్ తన ఒంటి కంటితో ఆట మెళుకువలు నేర్చుకొని మరలా బౌన్స్ బ్యాక్ అయ్యారు.కుడి కన్నుకు జరిగిన ప్రమాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ప్రమాదం జరిగిన ఆరు నెలలలోపే పటౌడి భారత టెస్టు జట్టులో చోటు సంపాదించుకున్నాడు.1961 డిసెంబర్లో ఇంగ్లాండ్ తో తన తొలి టెస్ట్ ఆడి గెలుపొందారు.కెరీర్లో ఆడిన 46 టెస్టుల్లో 45 మ్యాచ్లకు పైగా కెప్టెన్ గా ఉన్న పటౌడి భారత్ నుంచి అత్యంత గొప్ప కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు.1961 నుండి 1975 వరకు భారతదేశం తరపున మాజీ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ మరియు తరువాత 1980 లలో టెలివిజన్ క్రికెట్ వ్యాఖ్యాతగా మారారు.
పటౌడీ 1971లో గుర్గావ్ నియోజకవర్గం నుండి విశాల్ హర్యానా పార్టీ ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి  తయ్యబ్ హుస్సేన్ చేతిలో ఓడిపోయాడు.1984లో ఫరీదాబాద్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికలలో హుస్సేన్‌ను ఓడించినందుకు చౌదరి రహీం ఖాన్‌ను ఏనుగు ఎక్కిమరి అభినందించారు.పటౌడీని 25 ఆగస్టు 2011న సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్చారు దీర్ఘకాల మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా అతని ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను సరిగ్గా మార్పిడి చేయకుండా నిరోధించిన తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో 22 సెప్టెంబర్ 2011న తుది శ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: