కూటమిలో ముగ్గురు కొత్త రాజ్యసభ సభ్యులు వీళ్లే... !
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండుసార్లు గుంటూరు నుంచి ఎంపీగా గెలిచి ఎన్నికలలో సీటు వదులుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఒకటి ... కేంద్ర మాజీ మంత్రి విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు మరొకటి ... అలాగే జనసేన నుంచి నాగబాబుకు మూడో రాజ్యసభ స్థానం ఇవ్వాలని నిర్ణయానికి చంద్రబాబు దాదాపు వచ్చారని తెలుస్తోంది. ఈ ముగ్గురికి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యత్వం ఉంటుంది. ఇక నాగబాబు రాజ్యసభకు ఎంపిక అయితే జనసేన నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలి ఎంపిగా ఆయన పేరు రికార్డుల్లో నిలిచిపోతుంది.
ఇక ఎంపీ పదవులు వదులుకున్న వారిలో మోపి దేవి వెంకట రమణకు ఎమ్మెల్సీ ఇస్తారని టాక్ ? ఆయనకు ఎమ్మెల్సీ తో పాటు పార్టీలోనూ కీలక పదవి కట్టబెట్టనున్నారు. ఇక బీద మస్తాన్ రావుకు తర్వాత ఏదో ఒక పదవి ఇస్తారని అంటున్నారు. ఆయన గతంలో నెల్లూరు జిల్లా కావలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 లో టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీలోకి వెళ్లి రాజ్యసభ ఎంపీ అయ్యారు.