సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు దేవున్నీ నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా దేవుళ్లపై నమ్మకంతో అయ్యప్ప మాల కూడా వేస్తుంటారు. అలా ఇండస్ట్రీలో ప్రస్తుతం అయ్యప్ప మాలలో కనిపించే వారిలో రామ్ చరణ్ ఒకరు. అయితే రామ్ చరణ్ చిన్ననాటి నుంచి అయ్యప్ప మాల వేసుకోవడం అలవాటట. అయితే రామ్ చరణ్ అయ్యప్ప మాల వేయడం వెనుక ఒక అద్భుతమైన కథ ఉందని రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అంతే కాదు రామ్ చరణ్ మొదటి సారి అయ్యప్ప మాల వేసినప్పుడు నాతోనే ఉన్నారని ఆయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.. అది 2002 సంవత్సరం. నేను అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమల వెళ్ళడానికి రెడీ అయ్యాం.
ఈ టైంలోనే మెగాస్టార్ చిరంజీవి నన్ను పిలిచి రామ్ చరణ్ ని చూపించి మా అబ్బాయి కూడా మాల వేసుకున్నాడు. మొదటిసారి కన్నెస్వామి.. ఆయన బాధ్యత అంతా మీదే జాగ్రత్తగా శబరి తీసుకెళ్లి, మళ్ళీ ఇంటికి తీసుకురండి అని చెప్పాడు. దీంతో రామ్ చరణ్ గోపాలకృష్ణ కలిసి కారులో హైదరాబాదు నుంచి బయలుదేరి వరంగల్ అక్కడి నుంచి ట్రైన్ లో శబరిమలకు వెళ్లాలి. ఇక చిరంజీవి ఆయనను అప్పజెప్తూ చిరంజీవి గారి అబ్బాయి అని ఎవరికి తెలియకూడదు జాగ్రత్త సుమా అన్నారు.. ఇక చివరికి శబరిమలై మేము బయలుదేరాం. మేము వెళ్లి మళ్లీ వచ్చేలోపు రామ్ చరణ్ కేవలం నాలుగైదు మాటలు తప్ప మాట్లాడింది లేదు.
ఏది అడిగినా నవ్వుతూ ఉండేవాడు.. అంతేకాదు శబరిమలైలో కొండ ఎక్కేటప్పుడు ఎక్కగలవా అని అడిగితే సింపుల్ గా ఒక నవ్వు నవ్వాడు.. అలా మొదటిసారి ఆయన మాల వేసినప్పుడు నాతోనే శబరిమలై వచ్చాడని, కన్నె స్వామిగా మాతోనే పరిచయం ఏర్పడిందని అప్పటి జ్ఞాపకాలను నేను మర్చిపోలేనని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.. ఎంతో సైలెంట్ గా ఉండే రామ్ చరణ్ ఇంతటి స్టార్ హీరో అవుతారని నేను అనుకోలేదని, కానీ ఆయన అప్పటికి ఇప్పటికీ ఎంతో మారిపోయారని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారని తెలియజేశారు. ఇప్పుడు ఎక్కడ కలిసిన మేమిద్దరం అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటామని అన్నారు.