ఏపీ: పవన్ వీరంగం వల్ల కూటమి కలవరపడుతోందా..?

Divya
పవన్ కళ్యాణ్ సినిమాలలో రాజకీయాలలో కూడా ఆయన మాటలు వింటే సగటు మనిషికి కూడా బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాన్ని అయినా సరే ఎక్కడైనా బలంగా చెప్పాలనుకుంటే కచ్చితంగా చెప్పగలరు. అందుకే పవన్ కళ్యాణ్ ఏ విషయానికి కూడా భయపడవరు. ఇటీవల ఎక్కువగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి అందుకు సంబంధించిన విషయాల పైన భారీగానే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీవారు లడ్డు కల్తీ అయిన విషయం పైన కూడా కలత చెందడం జరిగింది.

అందుకే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను మొదలుపెట్టడమే కాకుండా అందుకు సంబంధించి కొన్ని దేవాలయాలు దగ్గర మెట్లు కడగడం వంటివి చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అంటూ తెలియజేశారు. ముఖ్యంగా సినిమా హీరోల పైన కూడా ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. అలాగే హిందూ ధర్మం పైన ఇబ్బంది కలుగుతూ ఉంటే హిందువులంతా బయటికి రావాలి అంటూ తెలియజేశారు. అయితే ఒక సగటు రాజకీయ నేత ఎప్పుడూ కూడా ఇలాంటి పిలుపుని ఇవ్వలేదు.

అయితే పవన్ కళ్యాణ్ ఆవేశం వల్ల టిడిపి కూటమిలో ఇబ్బందులు పడుతూ ఉన్న బిజెపి అయితే కాస్త ఆనందంగా ఉంటోందట. పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు టిడిపిలో ఒక చర్చ కొనసాగుతోంది. అది తప్పు ఒప్పు తెలియకుండానే ఇలా చేస్తే ఎలా అని గూబుల్ కూడా పట్టుకుందట. ఈ సమయంలోనే మాజీ ఎంపీ హర్ష కుమార్ వంటి నేతలు కూడా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు. మరొకవైపు సనాతన ధర్మం కేవలం లడ్డు కల్తీ వ్యవహారం వల్లే డెబిట్గా మారింది. చాలామంది లడ్డు వ్యవహారాన్ని ఎంక్వయిరీ చేయకుండా కేవలం మాటలతోనే ముందుకు తీసుకువెళ్లడంతో చాలామంది నేతలు ఫైర్ అవుతున్నారు. వామపక్షాలు అయితే ఏకంగా మత రాజకీయాలు చేస్తున్నారంటూ కూటమి పైన విరుచుకుపడుతున్నారు. ఇలా అన్నిచోట్ల కూడా కూటమికి ఇబ్బందులే కనిపిస్తున్నాయి.. అలాగే 100 రోజుల పాలన వల్ల ఏమి చేయలేదంటూ మరొక నింద కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: