బతుకమ్మ పండక్కి.. ఈసారి చీరలు కాదు.. కొత్త కానుక?
బతుకమ్మ పండగ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల జీవనాడి బతుకమ్మ. అందుకే ఈ ఆట కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ పండగని కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఇక ఆ పండుగనాడు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కానుకలు తెలంగాణ మహిళా మణులకు సమర్పిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక సాంప్రదాయంగా వస్తోంది. గడిచిన 10 ఏళ్లలో కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా అందమైన చీరలను సమర్పించుకుంది. అయితే ఈసారి ప్రభుత్వాన్ని చేపట్టిన సీఎం రేవంత్.. బతుకమ్మ కానుకని మార్చబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాబోతున్న రెండు మూడు రోజుల్లో ఈ విషయం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు... చీరలు స్థానంలో ప్రతి మహిళ అకౌంట్ లోని 500 రూపాయలు చొప్పున జమ చేయబోతున్నట్లు సమాచారం. ఆ సంఖ్య పెంచబోతున్నట్టు కూడా గుసగుసలు వినబడుతున్నాయి. అయితే డబ్బులు ఇవ్వడం వెనకాల సీఎం రేవంత్ ప్రణాళిక చాలా అర్థవంతమైనది అని చెప్పుకోవచ్చు.
ఎందుకనగా, గత ప్రభుత్వం బతుకమ్మ పండగకి చీరలు పంపిణీ చేసి అభాసు పాలయ్యింది. విషయం ఏమిటంటే? చీరలు కానుకగా ఇస్తామని పీలికలు పంపిణీ చేశారు.. అని తెలంగాణ మహిళ ఆడపడుచుల చేతనే కెసిఆర్ ప్రభుత్వం నానా తిట్లు తిన్నది. కెసిఆర్ ప్రభుత్వం దిగిపోవడంలో ఈ విషయం కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. అది గ్రహించిన తాజా సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కానుకలో మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. అయితే తాజాగా 500 రూపాయల విషయంలో కూడా వివాదం చెలరేగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మహిళా మణులు... చీర కొనుక్కోవడం కోసం నాకు 500 రూపాయలు చాలదని, వెయ్యి రూపాయలు కావాలని అడుగుతున్నట్టు తెలంగాణలో గుసగుసలు వినబడుతున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి తమ ఆడంగుల గొంతెమ్మ కోర్కెలు తీరుస్తాడో లేదో చూడాలి మరి!