హ్యాట్సాఫ్ లోకేష్.. సీఎం కొడుకు, ఐటీ మినిస్టర్.. అయినా ఏం చేసాడంటే?

praveen

అవును, మీరు విన్నది నిజమే. మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ ఒకటి ఓ సామాన్యుడి కారుని ఢీకొట్టగా అది కాస్త వైరల్ న్యూస్ అయింది. దాంతో స్పందించిన మంత్రి నారా లోకేష్ క్షమాపణలు అడుగుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు. దాంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాధారణంగా రాజకీయ నాయకులు, ఓట్లు అడగడానికి తప్పితే.. తరువాత సామాన్యుల బాధతలు పట్టించుకోరని ఓ అభిప్రాయం ప్రజలలో ఉంది. ఆ స్టేట్మెంటుని కొట్టి పారేయలేం కూడా. ఎందుకంటే మన సర్కారు వారి బాగోతాలు గురించి దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో కూడా ఏపీ అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం కూడా తెలిసిందే.
అయితే అదంతా పాత పధ్ధతి. ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేతబట్టాక కొత్త పుంతలు తొక్కుతోంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వంలో కొంత మంది డౌన్ టు ఎర్త్ ఉన్నారు. అలాంటి రాజకీయ నేతల్లో నారా లోకేష్ ఒకరు. విశాఖలో జరిగిన ఈ ఘటనపై ఆయన స్పందనే దీనికి నిదర్శనం అంటూ విశ్లేషకులు ప్రస్తుతం నారా లోకేష్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. విషయం ఏమిటంటే... నారా కోకేష్ సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వెళ్లారు. ఆయన కాన్వాయ్ రోడ్డుపై దూసుకెళ్తున్న సమయంలో... మరో కారును అనుకోకుండా ఢీకొట్టడం జరిగింది. దాంతో ఆ కారుకు కాస్త డ్యామేజ్ అయింది. కానీ కాన్వాయ్ ఆపలేదు. అయితే డ్యామేజ్ అయిన కారు ఓనర్  కల్యాణ్ భరద్వాజ్  వెంటనే సోషల్ మీడియాలో పెట్టి నారా లోకేష్‌కు ట్యాగ్ చేశారు.
దాంతో, వెంటనే నారా లోకేష్ స్పందించి, వివరణ ఇచ్చారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే... సీఐఐ సదస్సులో పారిశ్రామిక వేత్తలతో సమావేశాల్లో బిజీగా ఉండి కూడా రిప్లయ్ ఇవ్వడం. తన కాన్వాయ్ వల్ల జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ... తన సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పారు కూడా. అదేవిధంగా తన టీమ్ కారుకు అయిన డ్యామేజీ ఖర్చును భరిస్తుందని.. కూడా సదరు బాధితుడికి హామీ ఇచ్చారు. సహజంగా రాజకీయ నేతలు ఇలా స్పందించడం కష్టం. కానీ బిజీగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా లోకేష్ స్పందించడం అనేది హర్శించ దగ్గ విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: