'జమిలి'తో జరగబోయే కీలక మార్పులుతో లాభామా.? నష్టమా.?
* వందరోజుల్లోనే సర్పంచ్ టూ ప్రధాని ఎన్నిక..!
* దేశమంతా ఒకేరోజు బాధ్యతల స్వీకరణ.!
* ఎన్నిక ఖర్చు తగ్గించడమే ప్రధాన లక్ష్యమా.?
1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి 1967లో జరిగిన నాల్గవ సార్వత్రిక ఎన్నిక వరకు భారతదేశంలో ఎన్నికల జరిగాయి అంటే పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు కలిసే నిర్వహించారు.అయితే 1972లో జరగాల్సిన ఎన్నికలు 1971లోనే జరగడంతో మొదటిసారి జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది.దేశంలో మరల జమిలి ఎన్నికలు పునరుద్ధరించాలని ఎన్డీఏ ప్రభుత్వం మొదటి నుంచి గట్టి పట్టుదలతో ఉంది దీనికోసం మాజీ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ వేసి అందించిన నివేదికను కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది.అయితే ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలనే ఆలోచనతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ ప్రక్రియ అమలు కోసం రాజ్యాంగ సవరణలు, రాష్ట్రాల ఆమోదం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఈ ఎన్నిక విధానం వల్ల కలిగే ప్రధాన ఆరు మార్పులు అనేవి ఎంటనేది ఆసక్తికరంగ మారింది.ఈ ఎన్నికల్లో భాగంగా ఒకేసారి పార్లమెంట్,అసెంబ్లీ,స్థానికసంస్థల ప్రచారాలు మరియు పోలింగ్ నిర్వహణ అనేది వందరోజుల్లోనే ముగుస్తుంది.గెలిచిన పార్టీ నాయకులందరికి ఒకే రోజు బాధ్యతలు స్వీకరణ చేపడతారు.ఏదైనా కారణాల వల్ల ప్రభుత్వం కూలిపోతే ఉప ఎన్నికలు నిర్వహిస్తారు.
అలాగే అదే సమయంలో మిగిలి ఉన్న సమయానికి అపద్దర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కానీ దాంట్లో భాగంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నుండి ఉమ్మడి కూటమిగా ప్రభుత్వం ఏర్పడుతుంది.అలాగే ఒకటే ఓటరు జాబితాతో ఎన్నికల నిర్వహణ చేస్తారు.దీనివల్ల దొంగ ఓట్లు వేసేవారిని అరికట్టొచ్చు.అలాగే ఒక్కరు ఒకేచోటు మాత్రమే పోటీచేసే అవకాశం మాత్రమే జమిలి వల్ల జరుగుతుంది.దీనివల్ల ఖర్చు అనేది బాగా తగ్గిపోవడం అనేది జమిలి ఎన్నికల ప్రధాన అంశం.అయితే ఈ ఎన్నిక విధానం అనేది రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీ నాయకులకు ఇబ్బందులు తప్పవు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న నాయకులకు మధ్యలోనే ప్రభుత్వాన్ని పడేసి మరల ఎన్నికలు నిర్వహించడం అనేది వారికీ ఒక పెద్ద పరీక్షలాంటిదే.