వందరోజుల కూటమి పాలనలో జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన బాబు?

Suma Kallamadi
టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని చేపట్టి, విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం షురూ చేస్తూ, ప్రజలలోకి దూసుకు పోయి, తాము చేసిన కార్యక్రమాల గురించి డబ్బా కొట్టుకుంటారని భావించిన విపక్షం వైసికి అతి పెద్ద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు! అవును, కట్ చేస్తే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి అనేక రకాలైన శ్వేత పత్రాలు విడుదల చేసి మరీ వైసీపీ గత ఐదేళ్ల పాలనలో ఏపీ రాష్ట్రాన్ని ఎలా బ్రష్టు పట్టించిందో బాబు గారు బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఏపీలో తాజాగా సంభవించిన భారీ వరదలతో బెజవాడ మునగడం వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు.
బుడమేరు చుట్టూ ఆక్రమణలు జరిగాయని, దానికి గత వైసీపీ ప్రభుత్వమే కారణం! అని కూటమి పెద్దలు ఇపుడు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లడ్డు వ్యవహారం ఉండనే ఉంది! దాంతో ఇపుడు వైసీపీ అధిష్టానం బాబు దెబ్బకి ఉక్కిరి బిక్కరి అవుతోంది. అది మాత్రమే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని ఒక సెజ్ లో జరిగిన పేలుడు ఘటన వెనక కూడా వైసీపీ గత అయిదేళ్ళ నిర్లక్ష్య పాలనే కారణం అని బాబు సహా అంతా ఆరోపించారు. ఇలా ఈ వంద రోజులలో వైసీపీ కూటమి వందకు వంద తప్పులను ఎత్తి చూపడంతో టీడీపీ కూటమి సర్కార్ విజయవంతంగా సక్సెస్ అయింది.
ఇకపోతే, ఇపుడు ఎక్కడ విన్నా తిరుపతి లడ్డూ గురించే చర్చ జరుగుతోంది. మొదట్లో దీని సీరియస్ నెస్ తెలియక వైసీపీ నాయకులు కొంతమంది మైక్ ముందుకు వచ్చి ఏదేదో వాగారు. కానీ, ప్రస్తుత వ్యవహారాలు చూసి వారికి మతి పోతోంది. అదే సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే వ్యవహారం పైన కాస్త అసహనంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాటి సంగతి పక్కన పెడితే, గత 4 రోజులుగా వైసీపీ బ్యాన్ జగన్ బ్యాన్ అంటూ టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా లడ్డూ ప్రసాదంతో అపచారం చేసింది వైసీపీ అని నమ్మే హిందువులు అంతా పెద్ద ఎత్తున ఒకేతాటిపైకి వచ్చి ఈ విషయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ ఇరకాటంలో పడినట్టు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: