చంద్ర‌బాబు - ప‌వ‌న్ జాయింట్‌గా ఆ ఉద్యోగాల‌ను అట‌కెక్కించేశారా..?

Divya
గత రెండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు గత ఏడాది జనవరి 22వ తేదీన ప్రిలిమనరీ పరీక్షను కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో 95,209 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. అయితే వీరికి ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు చేస్తారో అంటూ నిరుద్యోగులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుంది, మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం పైన ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు..

హోం మినిస్టర్ అనిత గడిచిన కొన్ని నెలల క్రితం ఆగస్టు నెల నాటికి షెడ్యూల్ ఖరారు అవుతుందని చెప్పిన వీటి పైన ఇంకా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో ఇప్పటికైనా నిరుద్యోగుల విషయాలను దృష్టిలో పెట్టుకొని పిఈటి నిర్వహణ తేదీలను విడుదల చేయాలని అభ్యర్థుల సైతం అభ్యర్థిస్తున్నారు. గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ కానిస్టేబుల్ ల నియామక ప్రక్రియ సైతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని పనులు మొదలు పెడతామంటూ చెప్పిన వాటికి సంబంధించిన ఎలాంటి ప్రక్రియను కూడా కొనసాగించలేదు.

దీన్ని బట్టి చూస్తూ ఉంటే చంద్రబాబు, పవన్ జాయింట్ గానీ ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలను సైతం అట్టకెక్కించేలా  కనిపిస్తున్నారని పలువురు నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరి నిరుద్యోగుల ఆవేదనను కూటమి ప్రభుత్వం గుర్తించి వెంటనే ఈ కానిస్టేబుల్ నీ అమ్మకాలలో ప్రక్రియ భాగంగా PET పరీక్షలు నిర్వహిస్తారేమో చూడాలి. వాస్తవానికి నిరుద్యోగులు సైతం ఈ నోటిఫికేషన్ జారీ కంటే రెండు మూడేళ్లు ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సైతం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక ఇతర పనులకు పోలేక నిరుద్యోగులు మనోవేదనకు చెందుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: