తిరుమలలో పృథ్వీరాజ్ రాసలీలలు.. టాలీవుడ్ లో కెరీర్ సర్వనాశనం ?

Veldandi Saikiran
* తిరుమల కొండపైన పృథ్వి రాసలీలలు
* ఎస్విబిసి చైర్మన్ గా ఉండి పృధ్విరాజ్ అక్రమాలు
* టీటీడీ మహిళా ఉద్యోగులే టార్గెట్గా వేధింపులు
* పృధ్వీరాజ్ ఆడియో బయటకు రావడంతో.. పదవి గల్లంతు


ప్రపంచంలోనే తిరుమల శ్రీవారి కొండకు ఉన్న.. ప్రత్యేకత అంతా కాదు. స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైన వెలిశారు. అలాంటి తిరుమల శ్రీవారి కొండపైకి రోజుకు లక్ష మంది భక్తుల వరకు రావడం జరుగుతుంది. అయితే అలాంటి పవిత్ర క్షేత్రంలో.. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ పృధ్విరాజ్ చేసిన రచ్చ అంత ఇంత కాదు. జేబులో పాన్ లేదా గుట్కా పట్టుకుని.. తిరుమల శ్రీవారి కొండపైకి వెళ్తేనే కఠిన చర్యలు తీసుకుంటారు.
 
అలాంటిది టీటీడీ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించాడు టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్గా పృధ్వీరాజ్ నియామకమయ్యారు. ఆయన సరిగ్గా ఏడాది కాలం పనిచేశారో లేదో... ఓ ఆడియో టేప్ కారణంగా పదవి కోల్పోయారు. తన పదవిలో ఉన్నప్పుడే ఓ మహిళ ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడారు పృధ్విరాజ్. వెనకనుంచి గట్టిగా పట్టుకోవాలా...? అంటూ.. పృధ్విరాజ్ కు సంబంధించిన ఓ ఆడియో టేప్ వైరల్ గా మారింది.
 
అయితే ఈ ఆడియో వైరల్ కావడంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారు. పృధ్వి రాజును ఆ పదవి నుంచి తొలగించి పక్కకు పెట్టారు. దీంతో అప్పటినుంచి ఈ అంశం ఇంకా వివాదంగానే ఉంటోంది. అయితే వైసిపి నుంచి బయటికి వచ్చిన తర్వాత పృధ్విరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలనే కొంతమంది జగన్ మనుషులు... తనపై తప్పుడు ప్రచారం చేయించారని... పృధ్వి రాజు చెప్పడం జరిగింది.
 
అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్న పృధ్విరాజ్ ఎన్నికల కంటే ముందు జనసేనలోకి వెళ్లిపోయారు. అయితే ఆడియో టేప్ వైరల్ అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పృధ్విరాజ్ కు పెద్దగా చాన్సులు రాలేదు. కానీ మెగా కుటుంబాన్ని పొగుడుతూ చాలా సార్లు పృధ్వీరాజ్ మాట్లాడడంతో... మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు పృధ్విరాజ్. ఇప్పుడు కూడా అడపాదడప చాన్స్లే పృధ్విరాజ్ కు రావడం జరుగుతుంది. మొత్తానికి ఆయన రాసలీల కారణంగా.. కెరీర్ మొత్తం నాశనమైందిఅని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: