ఏపీ: వారికి రూ 25 వేల సహాయం ప్రకటించిన చంద్రబాబు..!

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో వరదల సంఖ్య చాలానే ఉంది. దీంతో రెండు రాష్ట్ర  ప్రభుత్వాలు కూడా వారిని ఆదుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు నాయకులు పలువురు వ్యాపారవేత్తలు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వరద బాధితులను దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు వారికి ఉపయోగపడే పని ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన కూడా కేంద్ర మంత్రి కుమారస్వామి తో మాట్లాడి మరి ముందుకు తీసుకెళ్తామంటూ తెలియజేశారు.

నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం ప్రకటించారు.. 179 సచివాలయాల పరిధిలో ఉండేటువంటి ఈ బాధితుల ఒక్కొక్క ఇంటికి 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఇంతవరకు ఎవరు కూడా ఇలా అందించలేదని కూడా తెలియజేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వారికి 10000 సహాయం చిరు వ్యాపారస్తులకు 25వేల ఆర్థిక సహాయం అందిస్తామని..MSME టర్న్ అవర్ నలభై లక్షలు ఉన్నవారికి 50వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించారు.

పాడైన వెహికల్స్ కు ఆర్థిక సహాయం కింద పదివేల రూపాయలు అందిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు 15వేల రూపాయలు కిరాణా షాపుల వారికి 25000 ఇతరత్రా ఏదైనా వాహనాలకు 9000 రూపాయలు ఇస్తామని అలాగే దెబ్బతిన్న షిప్పింగ్ బోర్డులకు సుమారుగా 20000 రూపాయలు సహాయం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు తెలియజేశారు. ఇక హెక్టారుకు 25వేల రూపాయలు అందించబోతున్నట్లు తెలిపారు. అయితే ప్రతి ఒక్కరు కూడా పంట రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించి అన్ని విషయాలు ఈ రోజున క్యాబినెట్లో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. హైడ్రా అనేది కూడా హైదరాబాదుకు సంబంధించినదని ఇక్కడ కూడా అలాంటి ఏదైనా అక్రమాలు ఉంటే తొలగిస్తామంటూ వెల్లడించారు ఏపీ సీఎం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: