ఏపీ: వాలంటరీ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న టిడిపి నేత..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ఎప్పుడు ఎటువైపుగా తిరుగుతాయో చెప్పడం కష్టంగా మారుతూ ఉంటుంది.. 2024 ఎన్నికలకు ముందు కేవలం వాలంటరీ వ్యవస్థ పైనే రాజకీయాలు తిరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. దీంతో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు కూడ వాలంటరీ వ్యవస్థకు 5000 జీతం సరిపోదని 10,000 చేస్తామంటూ తెలిపారు. దీనికి మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా పలికారు.వీరిని తీసేయేము అని కూడా తెలియజేశారు. అయినప్పటికీ కూడ లక్షకు మంది పైగా రాజీనామా చేసి వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేశారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. దీంతో వీరి పరిస్థితి ఏంటి అనే విషయంపై కూడా వాలంటరీలు ఆందోళన చెందుతున్నారు.

ఇలాంటి సమయంలో గత కొద్ది రోజుల నుంచి వాలంటరీ వ్యవస్థ రద్దు చేయాలని చాలామంది భావిస్తున్నారు.. ఇప్పుడు తాజాగా ఇదే డిమాండ్ ని టిడిపి నేత రాజేంద్రప్రసాద్ కూడా తెలియజేశారు.. ఈయన పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. వాలంటరీ వ్యవస్థను రద్దుచేసి వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లకు ఎంపీటీసీలకు ఇవ్వాలంటూ సూచించారు.

అలాగే సచివాలయ వ్యవస్థలను కూడా పంచాయతీరాజ్ శాఖలోకి విధినం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వరదల వల్ల సుమారుగా 400 పంచాయితీలు దెబ్బతిన్నాయని దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కో పంచాయితీకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడంతో పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాలంటరీ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ పైన వాలంటీర్లు సరైన నిర్ణయం రాకపోవడంతో గత నెలలోనే విజయవాడకు వెళ్లి ధర్నా చేయాలనే విధంగా నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం విన్న వాలంటీర్లు ఏం చేస్తారనే విషయం తెలియాల్సి ఉన్నది.మరి డిప్యూటీ సీఎం సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: